విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వంశీ కష్టమేనా!: కొడాలి బాటేనా? ఎన్టీఆర్ తీరు సస్పెన్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vallabhaneni Vamsi-Jr Ntr-Kodali Nani
విజయవాడ: కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి వల్లభనేని వంశీ మోహన్ అసంతృప్తికి గురయ్యారు. గతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కౌగిలించుకొని తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైన వంశీ ఈరోజు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. గన్నవరం టిక్కెట్ పైన తనకు హామీ లేదని చెప్పారు. పార్టీ అభివృద్ధి కోసం ఎంతో పని చేశానన్నారు.

వల్లభనేని వంశీ గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని బాటలో నడిచే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు. నాని కొద్దినెలల క్రితం కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన తర్వాత వంశీ కూడా అదే బాటలో నడుస్తారనే ప్రచారం జరిగింది. వంశీ పార్టీ మారే విషయాన్ని కొట్టిపారేస్తున్నప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి ఎప్పుడైనా ఆయన జగన్‌కు జై కొట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

వంశీ, కొడాలి నాని మంచి మిత్రులు. వీరిద్దరు జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితులు. జగన్‌ను కౌగిలించుకున్నప్పటి నుండే వంశీపై అనుమానాలు రేకెత్తాయి. నాని జంప్ అయ్యాక అది మరింత బలపడింది. మరోవైపు వంశీ కూడా అప్పటి నుండి పార్టీ పట్ల అసంతృప్తితో ఉంటున్నారు. కొడాలి నాని వెళ్లే సమయంలో వెళ్తారనే ప్రచారం జరిగినప్పటికీ నానికి జిల్లాలో టిడిపి కార్యకర్తల నుండి ఎదురైన ప్రభావంతో వంశీ వెనక్కి తగ్గారట.

అయితే, ఆయన మనసు మాత్రం అటు వైపే ఉందంటున్నారు. అది ఆయన వ్యాఖ్యలను బట్టే అర్థమవుతోందంటున్నారు. గన్నవరం టిక్కెట్ ఇస్తానని బాబు హామీ ఇచ్చారని కానీ, దాసరి బాలవర్ధన రావుతో మాట్లాడించలేదని వంశీ చెబుతున్నారు. అయితే, అదే టిక్కెట్ కోసం పట్టుబడుతున్న ఎమ్మెల్యేను బుజ్జగించాల్సిన అవసరముందని గుర్తు చేస్తున్నారు. బాబు హామీ ఇచ్చినప్పటికీ మాట్లాడించలేదన్న కారణంతో అసంతృప్తిని బయటకు వెళ్లగక్కడం అంటే ఆయన మానసికంగా ఎప్పుడో సిద్ధమయ్యారంటున్నారు.

బాబు గన్నవరం టిక్కెట్ ఇచ్చినా, రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నా ఏదో అసంతృప్తి వెళ్లగక్కి ఆయన వచ్చే ఎన్నికల నాటికి బయట పడే అవకాశాలు లేకపోలేదంటున్నారు. టిడిపికి మంచి పట్టున్న, స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన జిల్లా అయిన కృష్ణా జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితంగా ఉన్న వారే జగన్ వైపు వెళ్లడంపై టిడిపి వర్గాలు అనుమానిస్తున్నాయి. అందులో జూనియర్ పాత్ర పైన తెలుగు తమ్ముళ్లు అనుమానిస్తున్నారు.

కొడాలి నానిలాగే వల్లభనేని వంశీ ఎక్కువ రోజులు పార్టీలో ఉండే అవకాశాలు లేవంటున్నారు. అయితే, ఇప్పటికే నాని కారణంగా ఆరోపణలు ఎదుర్కొన్న జూనియర్ ఎన్టీఆర్ కల్పించుకుంటే వంశీ వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు. నాని తర్వాత వంశీ కూడా అదే బాట పడితే జూనియర్ పైన అనుమానాలు ఎక్కువయ్యే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. నాని పార్టీని వీడినప్పుడు జూనియర్ ఖండించారు. వంశీ కూడా అదే బాట పడితే జూనియర్ స్పందిస్తారా? స్పందిస్తే ఎలా స్పందిస్తారు? అనే అంశంపై కూడా అప్పుడే చర్చ సాగుతోంది.

English summary
Telugudesam Party senior leader Vallabhaneni Vamsi expressed his dissatisfaction on party chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X