వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిల్‌షుక్‌నగర్ పేలుళ్లు: జుమేరాత్ బజార్‌ సైకిళ్లు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Cycles bought on same day of blasts?
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు వాడిన సైకిళ్లను ఒకే రోజు ఒకే చోట కొన్నట్లు భావిస్తున్నారు. ఆ సైకిళ్లను హైదరాబాదు పాతబస్తీలోని ముస్లిం జంగ్ వంతెన వద్ద గల జుమేరాత్ బజార్‌లో కొన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) భావిస్తోంది. ఇందుకు సంబంధించి దర్యాప్తు సంస్థకు కీలకమైన సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది.

పేలుళ్లకు పాల్పడిన రోజునే ఉగ్రవాదులను ఆ సైకిళ్లను కొన్నట్లు భావిస్తున్నారు. గురువారం ఫిబ్రవరి 21వ తేదీన పేలుళ్లు సంభవించాయి. ప్రతి గురువారంనాడు జుమేరాత్ బజార్ ఉంటుంది. ఉదయం పూట ఉగ్రవాదులు సైకిళ్లను కొన్ని సాయంత్రం వాడినట్లు చెబుతున్నారు.

రెండు సైకిళ్లలో ఒకటి నడపడానికి వీలు లేనంత పాతదని, మరోటి మాత్రం కొత్తదని ఎన్ఐఎ అధికారులు ఆర్ఎస్ బ్రదర్స్ దుస్తుల దుకాణం సిసిటివీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించినట్లు సమాచారం. సైకిళ్ల ముందు భాగాలు మాత్రమే ధ్వంసం కాకుండా దర్యాప్తు అధికారులకు చిక్కాయి. బాంబులు పెట్డిన సైకిళ్ల వెనకభాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

సంఘటనా స్థలంలో సైబరాబాద్, హైదరాబాదు పోలీసులు సేకరించిన వస్తువులను ఎన్ఐఎ అధికారులు పరిశీలించారు. సెకండ్ హ్యాండ్ సైకిళ్లపై గల రేడియం స్టిక్కర్లను వారు పరిశీలించారు. ఎన్ఐఎ అధికారులు గురువారంనాడు జుమేరాత్ బజార్‌కు వెళ్లి ప్రదేశాన్ని, సైకిళ్ల వ్యాపారులను వీడియో తీశారు. పేలుళ్లకు వాడిన సైకిళ్లు కొత్తవి కాదని, మరమ్మత్తు చేసిన పాత సైకిళ్లని పోలీసులు గుర్తించారు.

జుమేరాత్ బజార్‌లోని సైకిళ్ల వ్యాపారులను సైబరాబాద్ పోలీసులు రెడ్ హిల్స్‌లోని ఎపి స్టేట్ ఫోరెన్సిక్ లాబొరేటరీకి తీసుకుని వెళ్లి సైకిళ్లపై ఆరా తీశారు. అయితే, వాళ్లు సైకిళ్ల విడిభాగాలను గుర్తించలేకపోయారు. అయితే, ఉగ్రవాదులు సైకిళ్లను ఎవరి వద్ద కొన్నారనేది ఇప్పటికీ తేలలేదు.

English summary
The National Investigation Agency which has been groping in the dark for the last 35 days has come upon a crucial lead in the Dilsukhnagar blasts case. Its sleuths now believe that the terrorists who carried out the attack bought the two bicycles used in the crime from Jumeraat Bazaar near Muslim Jung Bridge on the day of the blasts itself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X