కుక్క కరిస్తే యజమాని అరెస్టు, పోలీసు ఆత్యహత్య

వినోద్ కుమార్ ఇంటికి సమీపంలో ఉన్న మరో ఇంటి యజమాని శ్రీపాదరావుకు రెండు పెంపుడు కుక్కలున్నాయి. వాటిలో ఓ కుక్క వినోద్ కుమార్‌పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన వినోద్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. వినోద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీపాద రావును పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాదులోని చాదర్‌ఘాట్ పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భాస్కర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బేగంబజారులోని పోలీసు క్వార్టర్స్‌లో అతను విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
యువతి ఆత్మహత్యాయత్నం
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం సీతక్కపేటలో కవిత అనే యువతి గురువారం ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఈ విషయాన్ని పసిగట్టిన కుటుంబ సభ్యులు సకాలంలో ఆమెను నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. మురళి అనే యువకుడు గత కొంత కాలంగా వేధిస్తున్నాడని, దాంతోనే ఆమె ఈ తీవ్ర ప్రయత్నానికి దిగిందని ఆరోపిస్తున్నారు. పోలీసులు మురళిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications