వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెవిపి తర్వాత వరుసగా: జగన్ కేసులో సిబిఐ దూకుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయనను ఎవరెవరు కలిసేవారని, ఎక్కువగా ఎవరు వచ్చేవారని తదితర విషయాలను వైయస్ వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన జన్నత్ హుస్సేన్‌ను గురువారం ప్రశ్నించినట్లుగా సమాచారం. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఎవరు ఎక్కువగా కలిసేవారని అడిగినట్లుగా తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎక్కువగా ఎవరొచ్చేవారని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

అలాగే సూరీడుతో సన్నిహితంగా మెలిగే వారి గురించి కూడా ఆరా తీసినట్లు సమాచారం. జన్నత్‌ను ఆయన ఇంట్లోనే ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు ఐపిఎస్ అధికారి రమేష్ రెడ్డిని దిల్‌కుషాకు పిలిపించి గంటన్నరపాటు విచారించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సిబిఐ కొద్ది రోజులుగా పలువురిని ప్రశ్నిస్తోంది. ఇటీవలే వైయస్ ఆత్మబంధువు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావును ప్రశ్నించింది.

తాజాగా వైయస్ వ్యక్తిగత సహాయకులుగా పని చేసిన అధికారుల నుంచీ సమాచారం సేకరిస్తోంది. వైయస్ హయాంలో జన్నత్ హుస్సేన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారి. కెవిపి, జన్నత్‌కు తెలీకుండా వైయస్ రాజశేఖర రెడ్డి ఏమీ చేసేవారు కాదనే వాదన ఉంది. వైయస్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన భాస్కర శర్మను రెండు రోజులుగా సిబిఐ ప్రశ్నించింది. రమేష్ రెడ్డిని గురువారం ప్రశ్నించారు.

కాగా, తాను హైదరాబాద్ కార్యాలయం వరకే పరిమితమని భాస్కర శర్మ చెప్పడంతో ఇడుపులపాయ, పులివెందులలో ఎవరెవరు కలిసేవారో, ఏ విషయాలు మాట్లాడేవారో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు వివరంగా తెలుసని భావించిన సిబిఐ.. రమేష్ రెడ్డి నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. అపాయింట్‌మెంట్ లేకుండా వచ్చి వైయస్‌ను కలిసిన పారిశ్రామికవేత్తలు, నేతలు, దళారీల వివరాలను రాబట్టిన సిబిఐ.. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని భాస్కర శర్మ, రమేష్‌రెడ్డికి స్పష్టం చేసినట్లు తెలిసింది. దశరథ రామిరెడ్డిని కూడా ప్రశ్నించింది.

English summary
Central bureau of Investigation(CBI) has questioned Jannat Hussan on Thursday at his residence in YSR Congress Party chief YS Jaganmohan Reddy's DA case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X