ఆన్‌లైన్ ఫ్రాడ్‌కు తిరుపతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్టు

ఇ చరణ్ అనే టెక్కీ వేరే వ్యక్తికి చెందిన 4 లక్షల రూపాయలు అక్రమంగా వాడుకున్నాడు. ఫోన్‌లో తన సోదరుడికి ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి ఎటిఎం కార్డు రహస్య సమాచారాన్ని తన సోదరుడు తీసుకుంటుండగా తాను విన్నానని చరణ్ చెప్పారు.
వివరాలను రాసుకున్న తర్వాత చరణ్ వాటిని వాడి ఓ మొబైల్ ఫోన్ కొన్నాడు. ఇతర ఖరీదైన గ్యాడ్జెట్స్‌ను వివిధ వెబ్‌సైట్ల నుంచి కొన్నాడు. ఐటి యాక్ట్ కింద చరణ్‌ను అరెస్టు చేసినట్లు సిఐడి అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ టి. కృష్ణ ప్రసాద్ ఓ ప్రకటనలో చెప్పారు.
చరణ్ అన్నయ్య చిత్తూరులో ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. ఓ రోజు ఆ కాంట్రాక్టర్ తన ఎటిఎం కార్డు చరణ్ అన్నయ్యకు ఇచ్చి డబ్బులు డ్రా చేసుకుని రావాలని చెప్పాడు. తన అన్నయ్యకు కాంట్రాక్టర్ పిన్ నెంబర్ చెబుతుండగా చరణ్ విన్నాడు. దాంతో మోసానికి పాల్పడ్డాడు.












Click it and Unblock the Notifications