జస్ట్ మిస్: ముషారఫ్ పైకి షూ విసిరిన అగంతకుడు

Pervez Musharraf
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పైన గుర్తు తెలియని వ్యక్తి ఒకరు బూటుశ్(షూ) విసిరాడు. శుక్రవారం ఉదయం ముషారఫ్ కేసు నిమిత్తం సింధ్ హైకోర్టుకు హాజరయిన సమయంలో ఈ సంఘటన జరిగింది. సమాచారం మేరకు... అగంతకుడు ముషారఫ్ లక్ష్యంగా బూటు విసిరినా అది అతనికి తలగలేదు. మాజీ అధ్యక్షుడికి భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

భారీగా భద్రత ఉండంతో పాటు అశేష జనవాహిని మధ్య ఉండటంతో అతనికి బూటు తగలలేదు. ముషారఫ్‌ను కోర్టులో హాజరుపర్చుతున్న సమయంలో పలువురు ఆందోళనకారులు అతనికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు. ముషారఫ్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.

దివంగత పాకిస్తాన్ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో హత్య కేసుకు సంబంధించి ముషారఫ్ ఈ రోజు సింధ్ హైకోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ముషారఫ్‌కు కోర్టు బెయిల్‌ను పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి గతంలోనే కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ రోజు దానిని పొడిగించింది. కోర్టు అతని బెయిల్‌ను మరో పదిహేను రోజులకు పొడిగించినట్లుగా తెలుస్తోంది.

దాదాపు నాలుగేళ్ల తర్వాత ఐదు రోజుల కిందటే ముషారఫ్ పాకిస్తాన్ వచ్చాడు. 69 ఏళ్ల ముషారఫ్ తన బెయిల్‌ను పొడిగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇతను ఈ రోజు వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరయ్యారు. గతంలో మార్చి 22వ తేదిన కోర్టు పది రోజుల బెయిల్ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+