మేకపాటి అలక, దీక్షలో నో: అద్దంకిలో వేర్వేరు ఆందోళన

ఆ కారణంగానే ఆయన పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్షకు హాజరు కాలేదంటున్నారు. తాను సూచించిన వారిని సమన్వయకర్తలుగా నియమించలేదని ఆయన పార్టీ పెద్దల పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.
ప్రకాశం జిల్లాలో వేర్వేరుగా జగన్ పార్టీ ఆందోళన
ప్రకాశం జిల్లాలో జగన్ పార్టీలో మరోమారు వర్గపోరు బహిర్గతం అయింది. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆ పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టింది. ఈ ఆందోళనల్లో పలు నియోజకవర్గాల్లో నేతలు ఎవరికి వారు బల ప్రదర్శన కోసం వేర్వేరుగా ధర్నాకు దిగుతున్నారుట
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, పార్టీ సీనియర్ నేత గరటయ్యల మధ్య టిక్కెట్ పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఈ నేతలు ఇద్దరు వేర్వేరుగా తమ తమ అనుచరగణంతో విద్యుత్ పై ఆందోళన చేపట్టారు. గిద్దలూరులోని పోటాపోటీ కనిపించింది.
కోమటిరెడ్డి వ్యతిరేక వర్గం భేటీ!
నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరుల వ్యతిరేక వర్గం భేటీ కానుంది. మంత్రి పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ తదితరులు భేటీ కానున్నారు.












Click it and Unblock the Notifications