వేధింపులతో ఆత్మహత్యాయత్నం: హెలికాప్టర్‌పై ఫైరింగ్

Students tried to commit suicide
ఒంగోలు/హైదరాబాద్: ప్రకాశం జిల్లా చీరాలలో ఇద్దరు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో డి.విజయకృష్ణ అనే విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కళాశాలలో హెచ్‌వోడి వేధిస్తున్నారంటూ ఈ విద్యార్థులు పురుగుల మందు తాగినట్లుగా సమాచారం. హాల్ టిక్కెట్ ఇవ్వనందునే విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా బంధువులు ఆరోపణలు చేస్తున్నారు.

హెలికాప్టర్ పైన మావోల కాల్పులు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీసు స్టేషన్ పరిధిలో కిందకు దిగుతున్న ఓ హెలికాప్టర్ పైన మావోయిస్టులు కాల్పులు జరిపారు. పామేడు పరిసరాల్లో నక్సలైట్లు పేలుడు జరిపినట్లుగా తెలుస్తోంది. దీంతో అదనపు బలగాలు అక్కడకు హెలికాప్టర్‌లో చేరుకున్నాయి. ఈ సమయంలో మావోలు హెలికాప్టర్ పైన కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు.

విశాఖలో అగ్ని ప్రమాదం

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం పెదనందపల్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది ఎకరాల చెరుకు తోట, 20 పశువుల పాకలు, 40 గడ్డివాములు తగులబడ్డాయి. ఈదురు గాలుల వల్ల మంటలు అదుపులోకి రావడం కష్టంగా మారింది.

చిట్టీల పేరుతో టోకరా

హైదరాబాదులో చిట్టీల పేరుతో ఓ వ్యక్తి రూ.3 కోట్ల మేర మోసానికి పాల్పడ్డాడు. నాచారం బాబా నగర్ ప్రాంతంలో నివసించే ఖలీల్ బాషా స్థానికంగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పలువురి నుండి చిట్టీల పేరుతో కోట్లు వసూలు చేశాడు. వసూలు చేసిన వాటితో రాత్రికి రాత్రి ఉడాయించాడు. పోలీసులను బాధితులు ఆశ్రయించారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

విశాఖలో మావోల పోస్టర్లు

విశాఖలో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునిచ్చారు. వారు ఏజెన్సీ ప్రాంతంలో పోస్టర్లు అంటించారు. మావోల పోస్టర్లతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+