'చిరుపై బాబు వ్యాఖ్యలు సరికాదు': యాడ్స్‌పై మెగాస్టార్

C Ramachandraiah
హైదరాబాద్/గుంటూరు: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కాంగ్రెసు పార్టీకి ఖచ్చితంగా ఆశాజ్యోతియేనని దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య గురువారం అన్నారు. ఆయన సిఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ నేత చిరంజీవిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు అవాస్తవమని అన్నారు. చిరంజీవి కారణంగా కాపులు దూరమయ్యారని బాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

కాపు సామాజికవర్గం అమ్ముడుపోయే రకం కాదన్నారు. నిశ్చలంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో అలజడి తెచ్చింది చంద్రబాబే అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సమయంలో పార్టీలో స్వతంత్రత ఉండేదన్నారు. చంద్రబాబు మాత్రం డిక్టేటర్‌గా మారారని ఆరోపించారు. స్వతంత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీని దెబ్బతీసిన ఘనత చంద్రబాబుదే అని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల పేరిట మాదిగ, మాలల మధ్య చిచ్చు పెట్టింది బాబే అన్నారు. సాయంత్రం జరగనున్న ముఖ్యమంత్రి సమావేశానికి తనకు ఇప్పటి వరకు ఆహ్వానం అందలేదన్నారు.

అవసరమైతే నటిస్తా.. చిరంజీవి

తన అవసరం ఉందనుకుంటే టూరిజం యాడ్స్‌లలో నటిస్తానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి చెప్పారు. టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా పలువురు చిరంజీవిని యాడ్స్‌లలో నటించమని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. బ్రాండ్ అంబాసిడర్‌గా తన అవసరముంటే తప్పకుంటా నటిస్తానని చెప్పారు. పర్యాటక సదస్సుకు తెలంగాణకు సంబంధం లేదని చెప్పారు.

ముందస్తుకు అవకాశం

బడ్జెట్ సమావేశాల తర్వాత ముందస్తు ఎన్నికల పైన కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు గుంటూరులో అన్నారు. సమావేశాల అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

ప్రస్తుతం కేంద్రం దృష్టి అంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల పైన ఉందన్నారు. ఆ ఎన్నికల కోసం కసరత్తు చేస్తోందన్నారు. కాంగ్రెసు ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల పార్లమెంటు సభ్యులతో ఈ విషయమై మాట్లాడుతున్నారని రాయపాటి ఈ సందర్భంగా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+