జయప్రదకు నో వెకెన్సీ, బాబును జైళ్లో పెట్టేవారు: గండ్ర

Gandra Venkataramana Reddy
హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రదకు తమ పార్టీలో వెకెన్సీ లేదని అందుకే ఆమె వేరే పార్టీలోకి వెళ్లేందుకు చూస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి గురువారం అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటోను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఎందుకు ఉపయోగించుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సమాచారం లేకుండా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఆచరణ సాధ్యం కాని హామీలిస్తన్నారని మండిపడ్డారు. ఆయన ఆచరణ సాధ్యం కాని హామీలకు ఇతర దేశాల్లో అయితే జైల్లో పెట్టేవారన్నారు.

ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేస్తా... పనబాక

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేపట్టిన ఇందిరమ్మ బాట కార్యక్రమంలో జరిగిన ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘనపై తాను ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. ప్రభుత్వం వైద్య కళాశాల భవన శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ నిబంధన ఉల్లంఘన దురదృష్టకరమన్నారు. శిలాఫలకంలో తన పేరు లేకపోవడంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటానన్నారు.

ఆరోగ్యశ్రీతో ప్రయివేటు ఆసుపత్రులకే లబ్ధి.. కొండ్రు

ఆరోగ్యశ్రీ వల్ల ఎక్కువగా లబ్ధి పొందింది ప్రయివేటు ఆసుపత్రులేనని మంత్రి కొండ్రు మురళి అన్నారు. ఆరోగ్యశ్రీ నిధుల్లో ఎక్కువ భాగం ప్రయివేటు ఆసుపత్రులకే వెళ్లాయన్నారు. ప్రభుత్వాన్ని బెదిరించి లాభపడదామనుకుంటే కుదరదన్నారు. ప్రయివేటు ఆసుపత్రుల బెదిరింపులకు లొంగేది లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+