రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త ట్విస్ట్: జగన్ నో, బిజెపి లేదా టిడిపిలోకి జయప్రద!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprada
హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద రాష్ట్ర రాజకీయ ఆరంగేట్రంపై ట్విస్ట్ మీద ట్విస్ట్ కొనసాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తానని ఆమె ప్రకటించినప్పటి నుండి ఆమె వ్యాఖ్యలు చూస్తుంటే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వరుసగా వెళ్తున్నట్లు కనిపించింది. ఆమె చేస్తున్న వ్యాఖ్యల కారణంగా అలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా ఆమె జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో పాత పార్టీ తెలుగుదేశం పార్టీలో కూడా చేరే అంశాన్ని కొట్టి పారేయలేమనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జయప్రద దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని పొగడటం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసు అంశాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

అంతకుముందు ఆమె తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె జగన్ పార్టీలో దాదాపు చేరుతున్నట్లుగానే అందరూ భావించారు. అయితే, ఈ నెలాఖరు వరకు తన చేరికపై ఆమె సస్పెన్స్ విధించారు. ఆమె రాజమండ్రి టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. ఆ టిక్కెట్ కోసమే ఆమె జగన్ పార్టీలో చేరాలని ప్రధానంగా నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.

వైవి సుబ్బారెడ్డిని అడిగినా నో...!

రాజమండ్రి టిక్కెట్ పైన జగన్ ఇప్పటికే ఇతరులకు హామీ ఇచ్చారు. టిడిపి తిరుగుబాటు ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు తనయుడికి రాజమండ్రి టిక్కెట్ పైన జగన్ హామీ ఇచ్చారట. బొడ్డు కూడా అందుకోసమే టిడిపిని వీడి జగన్ వైపుకు వచ్చారని చెబుతున్నారు. జయప్రద తనకు రాజమండ్రి టిక్కెట్ ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైవి సుబ్బారెడ్డిని కూడా అడిగారట. అందుకు అతను కష్టమని చెప్పినట్లుగా సమాచారం. రాజమండ్రి టిక్కెట్ కోసమే జగన్ వైపుకు వెళ్దామనుకున్న జయప్రద హామీ రాకపోవడంతో ఈ కొత్త ట్విస్ట్ ఇచ్చారని అంటున్నారు.

అమర్‌సింగ్ సలహా మేరకు...

తెలుగుదేశం పార్టీలో మురళీ మోహన్, కాంగ్రెసు నుండి ఉండవల్లి అరుణ్ కుమార్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి బొడ్డు భాస్కర రామారావు తనయులు రాజమండ్రి టిక్కెట్ కోసం దాదాపు ఖరారయినట్లే. అదే టిక్కెట్‌ను ఆశిస్తున్న జయప్రద బిజెపిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆమె రాజకీయ గురువు అమర్ సింగ్ సలహా తీసుకున్న అనంతరం ఆమె బిజెపిలో చేరాలనే నిర్ణయానికి దాదాపుగా వచ్చారని అంటున్నారు.

జాతీయ పార్టీలో చేరితేనే బాగుంటుందని అమర్ ఆమెకు చెప్పారట. బిజెపిలో చేరాలని సలహా ఇచ్చారట. దీంతో ఈ నెలాఖరు వరకు బిజెపిలోకి వస్తున్నట్లు ఆమె నుండి ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మరోవైపు పాత పార్టీలోకి వెళ్లే అంశాన్ని కూడా కొట్టి పారేయలేమంటున్నారు. బిజెపి నుండి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేని పక్షంలో జయప్రద పాత పార్టీ అయిన టిడిపిలోనే చేరి మరో స్థానం నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

English summary

 Actor turned politician Jayaprada, who turned 52 on Wednesday, will most likely join in Bharatiya Janata Party by the mont\h end.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X