ఉగాది రోజు తెలుగు వికీపిడియా మహోత్సవం

11వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ గోల్డెన్ థ్రెసోల్డ్ ప్రాంగణంలో జరుగుతుందని ఆయన చెప్పారు. వికీ చైతన్య వేదిక సందర్భంగా అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ గోల్డెన్ ధ్రెసోల్డ్ ప్రాంగణంలో వికీ అకాడమిని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
ప్రపంచ విజ్ఞాన సర్వస్వాన్ని తేట తెలుగు నుడికారంతో తెలుగు ప్రజలకు పూర్తి ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో సాగుతున్న ఈ అక్షరయజ్ఞంలో భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. 2001 జనవరి 15న ప్రారంభమైన వికిపి డియా ప్ర పంచ వ్యా ప్తంగా నేటికి 285 భాషల్లో 3 కోట్ల 63 లక్షల 46వేల 838 వ్యాసాలతో పురోగమిస్తోందని అన్నారు.
భారతీయ భాషల్లో దాదాపు అన్ని భాషల్లో వికిపిడియా పనిచేస్తోందని, తెలుగులో 2003 డిసెంబర్ 10న ప్రారంభమైందని అన్నారు. తెలుగులో ప్రస్తుతం 51వేల 457 వ్యాసాలు ఉన్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications