వేధించొద్దన్నందుకు యువతి తండ్రిని చంపిన ఉన్మాది

Daughter's stalker kills father, attacks mother
ముంబై: తన కుమార్తెను వేధించవద్దని వారించినందుకు ఓ యువకుడు వారి కుటుంబంపై దారుణానికి పాల్పడ్డాడు. యువతి తండ్రిని తుపాకితీ కాల్చి చంపిన అతను తల్లిపై కత్తితో దాడి చేశాడు. నాగపూర్‌లో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. నాగపూర్‌లోని శ్రీనగర్‌లో నివాసం ఉంటున్న యోగేశ్వర్ స్థానిక కళాశాలలో ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు.

ఇదే ప్రాంతంలో ఉంటున్న అన్వర్ అనే ఇరవై ఎనిమిదేళ్ల వ్యక్తి.. ప్రేమిస్తున్నానంటూ యోగేశ్వర్ కూతురు అశ్వని(22) వెంట పడ్డాడు. ఆమె తిరస్కరించినా ప్రేమిస్తున్నానని వేధించేవాడు. విషయం తెలుసుకున్న యోగేశ్వర్... యువకుడిని మందలించాడు. తన కూతురును వేధించవద్దని చెప్పాడు.

తన ప్రేమను అంగీకరించకుంటే అందరినీ చంపేస్తానని బెదిరించిన అన్వర్ మంగళవారం రాత్రి రెండు గంటల సమయంలో యువతి ఇంట్లోకి ప్రవేశించాడు. యోగేశ్వర్‌ను నిద్రలేపి దూషించాడు. నాటు తుపాకితో తలపై దారుణంగా కాల్చి చంపేశాడు. గమనించిన యోగేశ్వర్ భార్య బయటకు పరుగెత్తింది.

ఆమెను వెంబడించిన అన్వర్ ఓ కత్తితో ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపర్చాడు. అశ్వినిని ఇంటిపైకి లాక్కెళ్లాడు. అక్కడి నుండి తోసి వేయాలని ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించింది. దీంతో కుదరలేదు. ఇంతలో అరుపులు విని స్థానికులు అక్కడకు చేరుకున్నారు.

స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడు అన్వర్‌ను అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపడిన యువతి అశ్వినిని ఆమె తల్లిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+