హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి పిఆర్పీది ఫెయిల్యూర్ స్టోరీ, దగాస్టార్: టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: కేంద్రమంత్రి చిరంజీవిది ఓ ఫెయిల్యూర్ స్టోరీ అని తెలుగుదేశం పార్టీ నిప్పులు చెరిగింది. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన ఆదివారం చిరు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనికి టిడిపి ధీటుగా స్పందించింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి మార్పు మార్పు అని చెప్పి ఏకంగా పార్టీనే మార్చివేశారని ఎద్దేవా చేశారు. ఆయనది ఫెయిల్యూర్ స్టోరీయే అన్నారు.

తెలుగుదేశం పార్టీ బిసిలకు డిక్లరెషన్ ప్రకటించడం చూసిన కాంగ్రెసు పార్టీ భయపడి చిరంజీవిని తమ అధినేత పైకి ఉసిగొల్పుతోందని ధ్వజమెత్తారు. 2009 ఎన్నికల సమయంలో కాంగ్రెసు పంచెలూడదీస్తామని చెప్పిన వారు ఇప్పుడు అదే పంచెల చాటున దాక్కున్నారని విమర్శించారు. చంద్రబాబును విమర్శించే స్థాయి చిరంజీవికి లేదని వారు అన్నారు. చిరులా తాము పార్టీని అమ్ముకోలేదన్నారు.

పార్టీ సీనియర్ నేతలు బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి, సిఎం రమేష్, కాల్వ శ్రీరాములు తదితరులు చిరంజీవిపై నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యల పైన చిరంజీవి రాజ్యసభలో ఒక్క రోజు కూడా స్పందించలేదన్నారు. ప్రజల కోసం తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్నారన్నారు.

ప్రజల కోసం తాము ఎంత దూరమైన నడుస్తామన్నారు. కానీ, చిరంజీవిలా పార్టీని విలీనం చేయలేదన్నారు. సినిమాల్లో ఆయన మెగాస్టార్ అని రాజకీయాల్లో మాత్రం దగాస్టార్ అన్నారు. చిరంజీవి సలహాలు తమ పార్టీకి అవసరం లేదని వారు ఈ సందర్భంగా మండిపడ్డారు.

English summary
Telugudesam Party senior leaders alleged that Central Tourism Minister Chiranjeevi is not megastar in Politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X