ఎన్ కన్వెన్షన్: హీరో నాగార్జునపై లోకాయుక్తలో ఫిర్యాదు

Nagarjuna
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్స్ పైన లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. నాగార్జున పైన జనం కోసం అనే స్వచ్ఛంద సంస్థ బుధవారం ఉదయం లోకాయుక్తలో ఫిర్యాదును చేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని మాదాపూర్‌లో నిర్మించిన ఎన్ కన్వెన్షన్స్ పైన ఫిర్యాదు చేసింది.

అక్కడ ఉన్న తమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్స్‌ను నిర్మించారని ఆ స్వచ్చంద సంస్థ ఆరోపించింది. ఆ సంస్థ ఫిర్యాదును లోకాయుక్త స్వీకరించింది. అనంతరం.. దీనిపై విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలని సంబంధింత అధికారులను లోకాయుక్త ఆదేశించింది.

రేవంత్ వ్యాఖ్యలపై నాగార్జున స్పందన

మరోవైపు నాలుగు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున స్పందించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ను వాణిజ్య కార్యకలాపాలకు వాడుతున్నారన్న రేవంత్ వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురి చేశాయని నాగార్జున చెప్పారు. రేవంత్ రెడ్డి విమర్శలకు కారణమేంటో తెలియదన్నారు.

మంగళవారం నాగార్జున మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌తో కలిసి చంచల్‌గూడ జైలులో ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను కలిశారు. ఈ సందర్భంగా నాగార్జున స్పందిస్తూ.. వారు అలా ఎందుకు మాట్లాడారో తనకు అర్థం కావడం లేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+