వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్యూచర్ ప్లాన్!: చిరంజీవిని మోసేస్తున్నారు, కిరణ్‌కు సెగ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని ఇటీవల కాంగ్రెసు పార్టీ నేతలు మోసేస్తున్నారు! తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన అనంతరం చిరుపై విపక్షాలు విమర్శలు చేసినప్పుడు కాంగ్రెసు స్పందించింది. ఆ తర్వాత్తర్వాత స్పందన తగ్గిందనే చెప్పవచ్చు. చిరుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తే స్వయంగా ఆయనే స్పందించడమో లేక ఆయన వర్గానికి చెందిన మంత్రి సి.రామచంద్రయ్య, కన్నబాబులో స్పందించేవారు.

ఇటీవల చిరంజీవిపై ఎవరైనా మాట్లాడితే కాంగ్రెసు పార్టీ ఎదురుదాడికి దిగుతోంది. రెండు రోజుల క్రితం టిడిపి చిరును దగాస్టార్ అంటే మంత్రి దానం నాగేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి తదితరులు తీవ్రంగా స్పందించారు. ఇతర నేతలు కూడా స్పందించారు.

ప్రాధాన్యత పెరగడమే కారణమా?

చిరు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అయ్యాక అధిష్టానం వద్ద పరపతి పెరుగుతోంది. అదే విధంగా తన శాఖను కూడా ఆయన సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వద్ద మంచి మార్కులు కొట్టేస్తున్నారట.

దీంతో భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చుననే అభిప్రాయంతో నేతలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారట. చిరంజీవికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంది. 2014 ఎన్నికల్లో చిరునే అధిష్టానం సిఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఆయన తన పనితనం నిరూపిస్తే... అనే ఆలోచనతోనే కాంగ్రెసు వర్గం ఇప్పుడు ఆయనకు బాసటగా నిలుస్తోందంటున్నారు. అదే సమయంలోముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా నిలిచే వారు క్రమంగా తగ్గుతున్నారట.

English summary
Congress Party leaders like Danam Nageder, Gandra Venkataramana Reddy are defendant Central Tourism Minister Chiranjeevi now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X