మహిళపై కానిస్టేబుల్ ఘాతుకం: ప్రేమ నచ్చక గుండు

అతని చర్యలు గుర్తించిన ఆ మహిళ కేకలు వేస్తూ చాకచక్యంగా ఆ కానిస్టేబుల్‌ను గదిలో బంధించింది. చుట్టుపక్కల వారికి చెప్పింది. వారు కానిస్టేబుల్‌కు దేహశుద్ధి చేశారు. కానిస్టేబుల్ స్పృహ కోల్పోయాడు. అతడు హృద్రోగ పేషెంట్ అని కానిస్టేబుల్ శంకర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై గ్రామస్థులు ఎస్సైకి సమాచారం అందించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ప్రేమ నచ్చక...
కూతురు ప్రేమ వ్యవహారం నచ్చని తల్లిదండ్రులు ఓ యువతికి గుండు గీయించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం గుండపురి గ్రామానికి చెందిన గుండ్ల రాములు, సంతోషిల కుమార్తె అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. వారిద్దరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
పదిహేను రోజుల క్రితం వారిద్దరి కలిసి ఎటో వెళ్లిపోయి తిరిగి సోమవారం వచ్చారు. దీంతో వారిని చితకబాదారు. యువతికి గుండు గీశారు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను స్టేషన్‌కు తరలించారు. తల్లిదండ్రులతో పాటు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications