వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసమే..: బిజెపి ఆఫీస్‌లోకి నాగం అడుగు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న యూపిఏ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వదని తేలిపోయినందునే ఎన్‌డియే ఆ బాధ్యతను నెరవేరుస్తుందని తాను నమ్ముతున్నానని చెప్పారు.

2014 తర్వాత ఎన్డీయే తెలంగాణ ఇస్తుందనే విశ్వాసంతోనే తాను బిజెపి కార్యాలయంలోకి అడుగు పెట్టానని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణ కోసం బిజెపితో కలిసి పని చేస్తానన్నారు. ఎన్డీయే అధికారంలోకి రావాలనే కోరికతోనే తాను ఈ కార్యాలయంలో అడుగు పెట్టానని చెప్పారు. ఈ స్నేహ హస్తం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.

రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెసు శని గ్రహాలను పారద్రోలాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కొత్త సంవత్సరంలో మంచిపై చెడు సాధించే విజయంలా యూపిఏ అవినీతి పైన ఎన్డీయే విజయం సాధిస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డి అన్నారు.

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీ కార్యాలయాల్లో ఉగాది వేడుకలు జరిగాయి. రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగాయి. సిద్ధాంతులు పంచాంగ శ్రవణం వినిపించారు.

English summary
Nagarkurnool MLA and Telangana Nagara Samithi chief Nagam Janardhan Reddy entered in BJP state office on Thursday for Ugadi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X