విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన, అరెస్ట్

Teacher held for molesting girls
హైదరాబాద్: విద్యార్థినిని వేధించారనే ఆరోపణలతో ఓ ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్వాల్‌లోని ఓ ప్రయివేటు పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడిని అల్వాల్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. యాభై అయిదేళ్ల ఆ ఉపాధ్యాయుడు హిందీ మాద్యమాన్ని బోధిస్తున్నారు.

అతను ఐదు, ఆరు, ఏడో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. బాధితురాలైన ఓ బాలిక తల్లిదండ్రులు అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయుడి వ్యవహారం బయటకు వచ్చింది. స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయమై పాఠశాల యాజమాన్యాన్ని నిలదీసింది.

బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. ఐదో తరగతి చదువుతున్న పదకొండేళ్ల బాలిక తన తల్లిదండ్రులకు ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. ఆమె వాష్ రూంలోకి వెళ్తుండగా పిలిచిన ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది.

కారణం లేకుండానే అతను తనను కొట్టాడని, తిట్టాడని తెలిపింది. తల్లిదండ్రులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరుపుతున్న పోలీసులకు మరో ఐదుగురు బాలికలను కూడా సదరు ఉపాధ్యాయుడు వేధించినట్లుగా తెలిసింది. విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పేందుకు భయపడ్డారు. టీచర్ కొడతాడనే భయంతో వారు చెప్పలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+