పారిపోయిన పర్వేజ్ ముషారఫ్ ఫాంహౌస్‌లో అరెస్ట్

అనంతరం బెయిల్ పొడగింపుకు కోర్టు తిరస్కరించి అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ రోజు నగర శివారులోని ఫాంహౌస్‌కు వెళ్లారు. కోర్టు అరెస్టు చేయాలని ఆదేశించడంతో అతను పరారయ్యాడు. ఫాంహౌస్‌లో ఉండటంతో అక్కడకు వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నరు.
కాగా, ముషార్రఫ్ అరెస్టుకు పాకిస్తాన్ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తుల ఉద్వాసన కేసులో ముషార్రఫ్ బెయిల్‌ను పొడగించడానికి కోర్టు గురువారం నిరాకరించింది. కోర్టు ఆవరణ నుంచి ముషార్రఫ్ పారిపోయినట్లు డాన్ అనే మీడియా సంస్థ రాసింది.
ముషార్రఫ్ బెయిల్ దరఖాస్తును న్యాయమూర్తి షౌకత్ అజీజ్ సిద్దిఖీ తిరస్కరించారు. ఆ వెంటనే ముషార్రఫ్ అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. కోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే ముషార్రఫ్ వద్దకు చేరుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే, వ్యక్తిగత భద్రతా సిబ్బంది చుట్టుముట్టి ఉండగా ముషార్రఫ్ బుల్లెట్ ప్రూఫ్ నల్లటి ఫోర్ వీలర్‌లో పారిపోయినట్లు డాన్ మీడియా రాసింది.
తాను అధికారంలో ఉన్నప్పుడు ముషార్రఫ్ 2007లో న్యాయమూర్తులపై వేటు వేశారు. ముషార్రఫ్ నాలుగేళ్ల పాటు విదేశాల్లో తలదాచుకున్నారు. గత నెలలోనే ఆయన మే 11వ తేదీన జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి పాకిస్తాన్ తిరిగి వచ్చారు. పాకిస్తాన్ తాలిబాన్ల నుంచి ముప్పు ఉన్నప్పటికీ, వివిధ ఆరోపణల్లో అరెస్టుకు అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారు.
పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ముషార్రఫ్ తీవ్రంగానే ప్రయత్నించారు. ఇస్లామాబాద్‌లోని నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేయడానికి ముషార్రఫ్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ట్రిబ్యునల్ తిరస్కరించింది. మూడు నియోజకవర్గాల్లోనూ ఆయన నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. చిత్రాల్ నియోజకవర్గంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి స్వీకరించినప్పిటీ పలువురు అభ్యంతరాలు తెలుపుతూ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో పోటీ చేసే అవకాశం ఆయనకు లేకుండా పోయింది.
-
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications