బైక్‌తో ఢీకొట్టి తీసుకెళ్లి బాలిక రేప్: రిసెప్షనిస్ట్‌పై యత్నం

West Godavari Dist
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా యాళ్లవారిమెరకలో శుక్రవారం సాయంత్రం తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ కార్మికుడు అత్యాచారం చేశాడు. తండ్రి లేని ఆ బాలిక తన బాబాయ్ కోసం వెళ్తుండగా నిందితుడు మోటారు సైకిల్ పైన ఎదురుగా వచ్చి ఢీకొన్నాడు. అనంతరం ఆ బాలికను బలవంతంగా సమీపంలోని సరుగుడు తోటలోకి తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడు. ఆ బాలిక బాబాయ్ ఫిర్యాదు మేరకు మొగల్తూరు పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఖమ్మం జిల్లాలోను దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై పొరుగింట్లో ఉండే సైదులు అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. శనివారం మధ్యాహ్నం తన మేనకోడలితో ఆడుకునేందుకు వచ్చిన ఆ బాలికను సైదులు నోరుమూసి అత్యాచారం చేయబోయాడు. ఈ దారుణాన్ని గమనించిన సైదులు మేనకోడలు వెళ్లి బాలిక తల్లికి తెలిపింది. దీంతో తల్లి స్థానికులతో కలిసి వచ్చి సైదులును చితకబాది పోలీసులకు అప్పగించింది.

వరంగల్ జిల్లా పరకాలలో ఓ ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పని చేస్తున్న కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన యువతిపై జీపు డ్రైవర్ చోటేమియా అత్యాచారం చేయబోయాడు. వారి నుండి తప్పించుకునేందుకు ఆమె జీపులోంచి దూకడంతో గాయాలయ్యాయి. గాయాలతో కేకలు వేస్తున్న ఆ యువతిని నిందితుడే తిరిగి తన జీపులో ఆమె ఇంటి వద్ద దింపి పరారయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+