భర్తను కట్టేసి భార్యపై రేప్ యత్నం: అత్తపై కత్తితో దాడి

భార్యపై అత్యాచారయత్నం చేశారు. ఆమె పెనుగులాడుతూ కేకలు వేసి వారి నుండి తప్పించుకుంది. దుండగులు పారిపోయారు. భర్త, భార్యల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఒకరి పరారీలో ఉన్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు.
మహిళ ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం కోటయ్య క్యాంపులో ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పిల్లలకు కిరోసిన్ పోసి నిప్పంటించిన ఆమె తాను ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఇది జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. భర్తకు వివాహేతర సంబంధం ఉండటం, దీనిపై భార్యాభర్తల మధ్య తరుచూ గొడవ జరుగుతుండేదని చెబుతున్నారు.
అత్తపై కత్తితో దాడి
ప్రకాశం జిల్లా ముండ్లమూరులో కుటుంబ కలహాల నేపథ్యంలో ఏత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అత్తను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును నమోదు చేసుకొని అల్లుడిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications