లవ్ స్టోరీ: ఎమ్మెల్యేపై సొంత కూతురు ఘాటు ఆరోపణ

Eli Nani
ఏలూరు: తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు ఈలి నాని పైన అతని కుమార్తె రమ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి తనను మూడేళ్లుగా ఇంట్లోనే గృహనిర్బంధం చేశారని, తన భర్తను కలువకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈలి నాని కుమార్తె రమ్య అదృశ్యం చర్చనీయాంశమైంది. ఈ రోజు ఆమె మీడియా ముందుకు రావడంతో అదృశ్యం కొత్త మలుపు తిరిగింది. తాడేపల్లిగూడంలో అదృశ్యమైన రమ్య గుంటూరులో కనిపించారు. మీడియాతో మాట్లాడారు.

తాను, సందీప్ ఇద్దరం ప్రేమించుకున్నామని, 2008లోనే ప్రేమ వివాహం చేసుకున్నామని, ఆ విషయం అందరికీ తెలుసునని చెప్పారు. ఈ పెళ్లి ఇష్టం లేని తన తండ్రి మూడేళ్లుగా గృహ నిర్బంధానికి చేశారని, అయితే తాను ఎప్పటికైనా సందీప్‌ను కలుస్తాననే ఆశాభావంతో ఉండిపోయానని చెప్పారు. ఇటీవల తన తండ్రి తనకు ఇతరులతో పెళ్లి చేయాలని చూడటంతో తాను బయటకు రావాల్సి వచ్చిందన్నారు.

తాను తన భర్తను కలవకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తాను అదృశ్యం కావడానికి సందీప్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. అతను తన క్లాస్ మేట్ అని, అతనికి బెదిరింపులు రావడంతో గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో పని చేసుకుంటున్నాడని చెప్పారు.

ఈ విషయమై రమ్య హెచ్చార్సీలో ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. స్థానిక మహిళా సంఘాల మద్దతును కోరుతున్నారు. కాగా, రమ్య అదృశ్యం కావడంతో తాడేపల్లిగూడెం పోలీసులు సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో తన భర్తను విడుదల చేయాలని రమ్య డిమాండ్ చేశారు. పోలీసులతో కలిసి తన భర్తను, తనను వేధిస్తున్నారని ఆరోపించారు.

ఈలి నాని కూతురు రమ్య బిటెక్ చదివారు. ఆమె తన క్లాస్ మేట్ సందీప్‌ను 2008లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆమె తన తండ్రికి సందీప్ ఇష్టం లేక మరో పెళ్లి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఆమె ఈ రోజు గుంటూరులో కనిపించారు. మీడియా ముందుకు వచ్చారు. అయితే ఎమ్మెల్యే, పోలీసుల వర్షన్ తెలవాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+