అందరివాడు: వైయస్‌కి నీళ్లు... ఎన్టీఆరే హీరో(పిక్చర్స్)

హైదరాబాద్: ప్రస్తుత రాజకీయాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు చుట్టూనే ఇప్పుడు ఎక్కువగా తిరుగుతున్నాయి. ఆయన ఇమేజ్‌ని ఎవరికి వారు సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ను టిడిపి నేతగానే అందరూ భావిస్తున్నారు. కానీ, ఇటీవల పరిణామాలు, నేతల మాటలు చూస్తుంటే ఆయనను అన్ని పార్టీలు సొంతం చేసుకోవాలనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.

టిడిపి తమ నేత అంటుంటే.. వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలతో పాటు నందమూరి హరికృష్ణ, పురంధేశ్వరిలు మాత్రం అందరి నేత అంటున్నారు. ఆయన టిడిపికి మాత్రమే సొంతం కాదంటున్నారు. ఇటు రాజకీయ రంగంలో, అటు సినిమా రంగంలో ఎన్టీఆర్ పేరు చెప్పుకొనే నిలబడే ప్రయత్నాలు పలువురు నేతలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ను వ్యతిరేకించిన కాంగ్రెసుతో పాటు వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలు కూడా ఎన్టీఆర్ ఇమేజ్ కోసం తాపత్రయ పడుతుండటం విశేషం.

ప్రస్తుతం అందరికి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలు ఎన్టీఆర్‌ను ఉపయోగించుకుంటున్నాయి. విచిత్రమేమంటే కాంగ్రెసు పార్టీలోనే ముఖ్యమంత్రిగా ఎదిగిన వైయస్ రాజశేఖర రెడ్డి పేరును ఉపయోగించేందుకు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. కొందరు ఆ పేరును ఉపయోగించుకోవడంపై వ్యతిరేకిస్తుండగా మరికొందరు సమర్థిస్తున్నారు. అయితే, పురంధేశ్వరి లాంటి నేతలు ఎన్టీఆర్ పేరును కాంగ్రెసుకు తలిగించుకోవడంపై సొంత పార్టీ నేతలకు కొందరికి ఇష్టం లేకున్నా బాహాటంగా వ్యతిరేకించలేని పరిస్థితి. అదే వైయస్ విషయంలో బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు కొందరు.

ఇక వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు హీరోల ఫోటోలతో పాటు ఎన్టీఆర్ ఫోటోను ఉపయోగించుకుంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్ అవినీతిపరులని, వారిని చూసి ఓట్లు పడవని తెలిసే తమ నేత ఫోటోను వాడుకుంటున్నారని టిడిపి ఘాటైన విమర్శలు చేసింది. కొడాలి నాని వంటి నేతలు ఉన్నందున జగన్ పార్టీ కూడా ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకునే పనిలో పడింది. ఆ పార్టీ నేతలు కూడా ఎన్టీఆర్ ఫోటోను ఎవరైనా వాడుకోవచ్చునని చెప్పారు.

వైయస్‌కు నీళ్లు... ఎన్టీఆరే హీరో(పిక్చర్స్)

స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇప్పుడు అన్ని పార్టీలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఎవరికి వారు ఎన్టీఆర్ పేరుతో లబ్ధి పొందాలని చూస్తున్నారు.

వైయస్‌కు నీళ్లు... ఎన్టీఆరే హీరో(పిక్చర్స్)

వైయస్ రాజశేఖర రెడ్డి పైన కాంగ్రెసు పార్టీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఎన్టీఆర్‌ను అన్ని పార్టీలు సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయన కోసం చివరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా పోటీ పడే పరిస్థితి వచ్చింది. ఎన్టీఆర్‌ను మూడు ప్రధాన పార్టీలు సొంతం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తుండగా, వైయస్‌కు మాత్రం కాంగ్రెసు దూరంగా ఉండాలని చూస్తోంది. టిడిపి మొదటి నుండి బద్ద వ్యతిరేకి.

వైయస్‌కు నీళ్లు... ఎన్టీఆరే హీరో(పిక్చర్స్)

జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య పేరు పలకకుంటే మనుగడే లేదని చెప్పవచ్చు. దాదాపు ఆయన ప్రతి సినిమాలో తాతయ్యను ఉచ్చరిస్తుంటారు. తాతయ్యను ఇమిటేట్ చేస్తుంటారు.

వైయస్‌కు నీళ్లు... ఎన్టీఆరే హీరో(పిక్చర్స్)

చంద్రబాబుకు రూలింగ్ విషయంలో అంతర్జాతీయంగా ఖ్యాతి ఉంది. కానీ ఎన్టీఆర్ పేరు లేకుంటే బాబుకు, టిడిపికి మనుగడే లేదు.

వైయస్‌కు నీళ్లు... ఎన్టీఆరే హీరో(పిక్చర్స్)

కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవడమే కాదు.. కాంగ్రెసు పార్టీలో ఆమె అందలమెక్కింది కూడా ఎన్టీఆర్ కారణంగానే. హేమాహేమీలైన సీనియర్లను పక్కన పెట్టి ఆమెకు అవకాశాలు ఇచ్చారు ఢిల్లీ పెద్దలు. ఆమె తన ప్రతిభతో మెప్పు పొందటం వేరే విషయం.

వైయస్‌కు నీళ్లు... ఎన్టీఆరే హీరో(పిక్చర్స్)

వైయస్ రాజశేఖర రెడ్డి కూడా ఎన్టీఆర్ పథకాలను పొగిడిన రోజులు ఉన్నాయి. గతంలో ఆయన చంద్రబాబును విమర్శించాల్సి వచ్చినప్పుడు ఎన్టీఆర్ పథకాలను కాంగ్రెసు మాత్రమే అమలు చేస్తుందని చెప్పేవారు.

వైయస్‌కు నీళ్లు... ఎన్టీఆరే హీరో(పిక్చర్స్)

ఇప్పుడు ఫ్లెక్సీ రాజకీయాలు నెరపుతున్నారు. ఎన్టీఆర్ ఇమేజ్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎన్టీఆర్‌ను టిడిపికి దూరం చేసే కుట్ర జరుగుతోందని టిడిపి నేతలు మండిపడుతున్నారు కూడా.

వైయస్‌కు నీళ్లు... ఎన్టీఆరే హీరో(పిక్చర్స్)

నందమూరి వారసులకు ఎన్టీఆరే బ్రాండ్ అంబాసిడర్.

వైయస్‌కు నీళ్లు... ఎన్టీఆరే హీరో(పిక్చర్స్)

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్టీఆర్ పైన అభిమానంతో తన తనయుడికి ఆయన పేరు పెట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+