నేతలు, నటుల ముందంజ: అనిత, శోభా వెనుకంజ

 Karnataka polls: VIPs in leading
బెంగళూరు: కర్నాటకలో ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ప్రారంభమైంది. 223 నియోజకవర్గాలలో ఈ నెల 5వ తేదిన ఎన్నికలు జరిగాయి. 2940 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. కర్నాటక వ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇందులో పలువురు ప్రముఖులు కొందరు ముందంజలో మరికొందరు వెనుకంజలో ఉన్నారు.

ఆధిక్యంలో వీరే..

కుమారస్వామి (జెడిఎస్) - రామనగర
సిద్ధరామయ్య (కాంగ్రెస్) - వరుణ
శ్రీరాములు(బిఎస్సార్ కాంగ్రెస్) - బళ్లారి రూరల్
గాలి కరుణాకర్ రెడ్డి - హర్సనహళ్లి
జగదీష్ షెట్టార్(బిజెపి) - ధార్వాడ్ సెంట్రల్
సురేష్ బాబు(బిఎస్సార్ కాంగ్రెస్) - కంప్లి
యడ్యూరప్ప(కెజెపి) - శికారిపురి
అంబరీష్(కాంగ్రెస్) - మాండ్య
హరగళి(కాంగ్రెస్) - పరమేశ్వర నాయక్
కూట్లీగ - కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి

వెనుకంజ....

శోభాకరంద్లాజే(కెజెపి) - రాజాజీనగర్
అనిత(జెడిఎస్ నేత కుమారస్వామి భార్య) - చెన్నపట్నం
ఈశ్వరప్ప(బిజెపి) - షిమోగా
హానగళ్(కెజెపి) - ఉదాసి

ఇప్పటి వరకు కాంగ్రెసు పార్టీ 102 స్థానాల్లో, బిజెపి 42 స్థానాల్లో, జెడి(ఎస్) 40 స్థానాల్లో, కెజెపి 10 స్థానాల్లో, బిఎస్సార్ కాంగ్రెసు 2 స్థానాల్లో, ఇతరులు 10 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

ఉడిపి, తుంకూరు, సుడిగుట్ట, కార్వార్, అడగెలిలో కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో ఉంది. హోస్పెటలో బిజెపి, హొన్నాళిలో కెజిపి ఆధిక్యంలో ఉన్నాయి. ఈశ్వరప్ప సహా నలుగురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+