నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళపై రేప్: తండ్రిని కొట్టి బిడ్డపై లైంగిక వేధింపులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rape
కర్నూలు/ నెల్లూరు: కర్నూలు జిల్లా నందికొట్కూరులో భర్త కోల్పోయిన ఒక మహిళ (25)పై ఆర్ఎంపీ మల్లయ్య అత్యాచారం చేశాడు. నాలుగు రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది. ఆమె తన బంధువులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. తనను మల్లయ్య పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

దీంతో ఆమె బంధువులు గురువారం మల్లయ్యను పట్టుకుని చితకబాదారు. పోలీసులు వారించేందుకు యత్నించడంతో బాధితురాలి బంధువులు పోలీసుస్టేషన్ వద్ద బైఠాయించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, గ్రామ బహిష్కరణ చేస్తామని జిల్లా ఎస్పీ చంద్రశేఖరరెడ్డి హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. గతంలో ఒక బాలికను కిడ్నాప్‌చేసి అత్యాచారం చేసిన కేసులో మల్లయ్యకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం ఆ కేసు హైకోర్టులో ఉంది.

నెల్లూరులో గురువారం రాత్రి కొందరు దుండగులు ఏడేళ్ల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తండ్రిని మద్యం, శీతల పానీయం సీసాలతో తీవ్రంగా కొట్టారు. బాధితులు ఒక కిరాణ దుకాణం నుంచి వస్తుండగా ఈ దారుణం జరిగింది.

పైగా తండ్రికి వారు హెచ్చరికలు చేశారు. "మేము నీ కూతుర్ని ఆట పట్టిస్తున్న విషయం అందరికి తెలుసు... నీ కూతురిని తీసుకుని ఈ సమయంలో ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు" అంటూ సాయి, ప్రవీణ్, బాబు, వీరేంద్ర తదితరులు తన కూతురిని వేధించి, అడ్డుకున్న తనను విచక్షణ రహితంగా కొట్టారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా నిందితులు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

English summary

 RMP resorted to sexual assault against a woman in Kurnool district. A girl has been sexually harrassed by youth at Nellore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X