వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బన్సల్, అశ్వినీ ఔట్: జైపాల్‌కు రైల్వే, ఆజాద్‌కు హోం?

By Pratap
|
Google Oneindia TeluguNews

Pawan Kumar Bansal and Ashwani Kumar
న్యూఢిల్లీ: న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్, రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ వివాదాలు తీవ్ర స్థాయికి చేరడంతో తదుపరి చర్యలకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని డాక్ట్రర్ మన్మోహన్ సింగ్ పూనుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. బన్సాల్‌పై వేటు పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అశ్వినీ కుమార్ కూడా రాజీనామా చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వీరిద్దరు మంత్రివర్గం నుంచి తప్పుకున్న తర్వాత మంత్రుల శాఖల్లో భారీగా మార్పులు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

2014 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని మంత్రుల శాఖల్లో మార్పులు చేయాలనే ఆలోచనలో సోనియా గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు. కపిల్ సిబాల్‌కు న్యాయశాఖను అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా, ప్రస్తుతం సుశీల్ కుమార్ షిండే చేతిలో ఉన్న హోం శాఖను గులాం నబీ ఆజాద్‌కు అప్పగిస్తారని అంటున్నారు. ఇక రైల్వే శాఖను జైపాల్ రెడ్డికి అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద, శాఖల్లో సోమవారం మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరగవచ్చునని కూడా అంటున్నారు.

బన్సాల్ రాజీనామా చేయక తప్పదని అంటున్నారు. లేదంటే ఆయనకు ఉద్వాసన పలికవచ్చునని చెబుతున్నారు. బన్సాల్‌ను సిబిఐ ఏ క్షణంలోనైనా విచారించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గ సమావేశానికి బన్సాల్ హాజరు కాలేదు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరినప్పటికీ కార్యాలయానికి మాత్రం చేరుకోలేదు. కాగా, తన సొంత వాహనంలోనే ఆయన ప్రయాణిస్తున్నారు.

కాగా, అశ్వినీ కుమార్ కూడా రాజీనామా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన శాఖను మార్చే ఆలోచనలో ప్రధాని ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న న్యాయశాఖను కపిల్ సిబాల్‌కు అప్పగించవచ్చునని అంటున్నారు. బన్సాల్, అశ్వినీ కుమార్‌లను కొనసాగించాలనే పట్టుదలతో మన్మోహన్ సింగ్ ఉన్నట్లు చెబుతన్నారు. సోనియా గాంధీ మాత్రం వారిద్దరిని తప్పించాలని వాదిస్తున్నట్లు తెలుస్తోంది.

శనివారం జరిగే కాంగ్రెసు కీలక సమావేశంలో అశ్వినీ కుమార్, బన్సాల్‌ల భవిష్యత్తు తేలిపోతుందని అంటున్నారు. బన్సాల్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. కోల్ గేట్‌ కేసులో సిబిఐ నివేదికను మార్చారనే ఆరోపణలను అశ్వినీ కుమార్ ఎదుర్కుంటున్నారు.

English summary
A meeting of the Congress top brass is scheduled for Saturday evening amid talk that a decision on the removal of railway minister Pawan Kumar Bansal and shifting of beleaguered law minister Ashwani Kumar is on the cards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X