విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దమ్మున్న నేత జగన్, జైల్లో ఉన్నా సిఎం: దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Dadi Veerabhadra Rao
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను దాడి వీరభద్ర రావు ప్రశంసలతో ముంచెత్తారు. విశాఖపట్నం వచ్చిన ఆయన శనివారం వైయస్సారల్ కాంగ్రెసు పార్టీ జిల్లా కార్యాలయానికి వచ్చారు. వైయస్ జగన్‌ను ఆయన దమ్మున్న నేతగా అభివర్ణించారు. జైల్లో ఉన్నా కాబోయే ముఖ్యమంత్రి జగనే అని ఆయన అన్నారు. జగన్ వ్యక్తి కాదు, శక్తి అని ఆయన కొనియాడారు.

జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ఏక సూత్ర ప్రణాళికను అందరూ అమలు చేయాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్ారు. వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యమని ఆయన చెప్పారు. సమాజం మార్పు కోరుకుంటోందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అందలం ఎక్కించాలనేది ప్రజల భావనగా కనిపిస్తోందని ఆయన అన్నారు.

ఎన్టీ రామారావు తర్వాత అతంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆయన అన్నారు. అవినీతి ఆరోపణలు లేని పార్టీ ఏదైనా ఉందా అని అడిగారు. ప్రధాన మంత్రే అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని చెప్పారు.

ఏ జైలులో పెట్టినా కాంగ్రెసుకు వ్యతిరేకంగా పోరాడుతానని జగన్ చెప్పారని, ఇది ఎంతో దమ్మున్న నాయకుడి లక్షణమని అన్నారు. పదవి కోసం కాదు, గౌరవం కోసమే తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. కొణతాల రామకృష్ణతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ మధ్య విభేదాలున్నాయనేది మీడియా సృష్టేనని దాడి వీరభద్రరావు అన్నారు. కొణతాల బాధ్యత కలిగిన నాయకుడని, అందరం కలిసి వైయస్సార్ కాంగ్రెసు పార్్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పారు.

English summary

 The YSR Congress party leader Dadi Veerabhadra Rao said that YS Jagan will become CM. He termed YS Jagan as fearless leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X