పరీక్షహాల్లో బొమ్మతుపాకీతో ఎమ్మెల్యే కొడుకు బెదిరింపు

పదిహేడేళ్ల శివనర్సింహా రెడ్డి హైదరాబాదులోని బిహెచ్ఇఎల్ కూడలి వద్ద ఉన్న హోలీ క్రాస్ కళాశాలలో ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. చందానగర్‌కు చెందిన ప్రయివేటు కళాశాల విద్యార్థులు అందులో పరీక్షలు రాస్తున్నారు. ఈ సమయంలో తనకు సమాధానాలు చూపించాలంటూ సహ విద్యార్థులను శివనర్సింహా రెడ్డి తుపాకీ చూపించి బెదిరించారు.
ఈ నేపథ్యంలో ప్రయివేటు కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన రామచంద్రాపురం పోలీసు స్టేషన్‌లో సదరు విద్యార్థి పైన ఫిర్యాదు చేశారు. పోలీసులు శివనర్సింహా రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతని వద్ద బొమ్మ తుపాకీ అని తేల్చిన పోలీసులు అతనిని విడిచిపెట్టారు.
శివనర్సింహా రెడ్డి చందానగర్‌లోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తమకు కళాశాల నుండి ఫోన్ వచ్చిందని, కళాశాలలో ఓ విద్యార్థి తుపాకీని చూపించి బెదిరిస్తున్నారని చెప్పారని, తాము వెంటనే అక్కడకు వెళ్లి అతనిని పోలీస్ స్టేషన్ తీసుకు వచ్చి విచారించామని చెప్పారు.












Click it and Unblock the Notifications