ఐరిష్ యువతిపై అత్యాచారం: వ్యాపారి అరెస్టు

పార్క్ స్ట్రీట్‌లోని నైట్ క్లబ్‌లో బర్త్‌డే పార్టీ తర్వాత నిందితుడు తనపై అత్యాచారం జరిపాడని ఆ యువతి ఆరోపించింది. నైట్ క్లబ్ నుంచి ఆ యువతిని తన ఇంటికి తీసుకెళ్లిన అతను ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కోల్‌కతాలోని ఓ ఎన్జీవోలో ఆమె స్వచ్ఛందంగా పనిచేస్తోంది. అత్యాచారం సంఘటన జూన్ 1వ తేదీ తెల్లవారు జామున జరిగింది.
యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆ వ్యాపారవేత్త అమెరికాలో ఎంఎస్ చేసి వచ్చి తన తండ్రికి చెందిన ఎలక్ట్రానిక్ సరుకుల వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. ఇద్దరికి తెలిసిన ఓ మిత్రుడి ద్వారా ఐరిష్ యువతితో అతనికి పరిచయం ఏర్పడిందని, ఓ కామన్ ఫ్రెండ్ పిలిచిన పార్టీకి వారిద్దరు వెళ్లారని పోలీసులు వివరిస్తున్నారు.
పార్టీ ముగిసిన తర్వాత ఇంటి వద్ద దింపుతానని అతను తనకు చెప్పాడని, ప్లష్ రెసిడెన్స్‌కు వచ్చిన తర్వాత కాఫీ తాగుదామని మిత్రా చెప్పాడని, అందుకు తాను అంగీకరించానని, టీ తాగిన తర్వాత తనను అతను రేప్ చేశాడని ఆమె చెప్పింది. రేప్ చేస్తున్నప్పుడు తాను పూర్తి స్పృహలో లేనని ఆమె చెప్పింది.












Click it and Unblock the Notifications