మోసం చేశావు: జియా సూసైడ్ నోట్, ప్రేమ వైఫల్యమే!

ఆంగ్లంలో రాసి ఉన్న ఆ నోట్‌ను ఆమె తల్లి, సోదరి కనుగొన్నారు. జియాకు కవితలు రాసే అలవాటు ఉందని, అందువల్ల తన మనసులోని భావాలను కాగితం పైన పెట్టి ఉంటుందనే అనుమానంతో గాలించగా ఆ నోట్ కనిపించిందట. అందులో.. 'ఈ లేఖను మీరు చదివే సమయానికి నేను ఉండబోను. నీవు నన్ను మోసం చేశావు. నీతో సంబంధాన్ని పూర్తిగా విశ్వసించాను. అయితే నా సంబంధాన్ని నీవే పట్టించుకోలేదు' అని రాసి ఉంది.
గోవాలో జరిగిన ఒక విందు విషయంతో పాటు.. తమ మధ్య సంబంధం కారణంగా తీసుకున్న వైద్యం విషయాన్ని అందులో ప్రస్తావించి ఉంది. వైద్యం విషయం ప్రస్తావన ఉండటంతో స్నేహితుల ద్వారా అసలు సంగతేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా, ఆమె తల్లి రబియా ఖాన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...‘నా కూతురు పని ఒత్తిడి ఎదుర్కొంది అనే వార్తల్లో నిజం లేదు. ఆమె బాగానే ఉంది. ఎంతో సిన్సియర్' అని చెప్పుకొచ్చింది. జియా ఖాన్ పొట్టలో ఆల్కహాల్, ఒత్తిడి తట్టుకునే మాత్రలు గుర్తించినట్లు వస్తున్న వార్తలను కూడా ఆమె కుటుంబ సభ్యులు తోసి పుచ్చారు. శవ పరీక్ష నివేదికలో అలాంటిదేమీ లేదని, కావాలంటే మీరు చెక్ చేసుకోండి అంటూ మీడియాకు సూచించారు.
ఆమె ప్రేమించిన వ్యక్తి నుంచి మోసం, అబద్దాలు ఎదురయి ఉంటాయి. మాకేమీ రివేంజ్ తీర్చుకోవాలనే ఉద్దేశ్యం లేదు...కానీ ఆమె తప్పుడు వ్యక్తి ప్రేమలో పడిందనేది నిజం' అని జియా తల్లి రబియా మీడియాతో అన్నారు. ఆదిత్య పంచోలి ఫ్యామిలీ జియా అంత్యక్రియలకు రావడాన్ని మేము అంగీకరించలేదని, జియా సోదరి కరిష్మా వెల్లడించారు.












Click it and Unblock the Notifications