సూసైడ్ నోట్ ఎఫెక్ట్: కెసిఆర్‌ను అరెస్ట్ చేయాలని టిడిపి

రాష్ట్రంలో ప్రభుత్వమే లేదన్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితులను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం కెసిఆర్‌ను సంప్రదించాకే తెలంగాణకు ప్యాకేజీ అంటూ లీక్ చేసిందని పెద్దిరెడ్డి విమర్శించారు. ఆటో డ్రైవర్ లక్ష్మీ నారాయణ సూసైడ్ నోట్ చూస్తే తెలంగాణ ద్రోహులు ఎవరో అర్థమవుతోందన్నారు. ఆంధ్రా ప్రాంతానికి లక్ష కోట్ల ప్యాకేజీ ఇచ్చి రాష్ట్రాన్ని విభజించాలన్నారు. కెసిఆర్ తెలంగాణవాదాన్ని భాగ్యలక్ష్మి బంపర్ డ్రాగా చూస్తున్నారని విమర్శించారు. కాగా ఆటో డ్రైవర్ లక్ష్మీ నారాయణ ఆత్మహత్య నోట్‌లో కెసిఆర్ పేరును రాసినట్లుగా వార్తలు వచ్చాయి.
వైయస్‍పై సోమిరెడ్డి నిప్పులు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పని చేసిన కెవిపి రామచంద్ర రావు బంధువు నాలుగేళ్లలో రూ.300 కోట్లు సంపాదించారని టిడిపి నేత సోమిరెడ్డ చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కృష్ణపట్నం భూఆక్రమణను జగన్ కేసులో భాగంగా సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సహజ వనరులను ఓ కుటుంబానికి ధారాదత్తం చేసేందుకు అధికారం వైయస్‌కు ఎవరిచ్చారన్నారు. కృష్ణపట్నం భూకేటాయింపులలో వైయస్ కుటుంబానికి సంబంధం ఉందన్నారు.
చంద్రబాబు లేఖ
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ బహుగుణకు, రైల్వే శాఖ మంత్రి ఖర్గేకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఆయన ఈ రోజు డెహ్రాడూన్‌లో పర్యటించారు. అక్కడున్న బాధితులను పరామర్శించారు. అనంతరం ఖర్గే, బహుగుణలకు లేఖ రాశారు. గంగోత్రి హర్షిల్ వద్ద నాలుగు వందల మంది తెలుగు వారు ఉన్నారని, వారిని అదుకోవాలని లేఖలో కోరారు. అలాగే తెలుగు వారిని వారి స్వగ్రామాలకు పంపించేందుకు మానవ దృక్పథంతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కోరారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications