మరో విషాదం: తెలంగాణ కోసం ఆటో డ్రైవర్ ఆత్మహత్య

నాంపల్లి రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి జేబులో ఉన్న సెల్‌ఫోన్‌లోని నంబర్ ఆధారంగా ఆయన అన్నకు సమాచారం ఇచ్చారు. జేబులోని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీనారాయణకు భార్య, ఐదు నెలల వయసున్న కూతురు ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులను బిజెపి నేతలు బండారు దత్తాత్రేయ, భవర్‌లాల్ వర్మ పరామర్శించారు.
తెలంగాణ ఇవ్వకపోవడంవల్లే యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బలిదానాలు చేసుకోవద్దని, బతికి ఉండి తెలంగాణను సాధించుకోవాలని పిలుపు ఇచ్చారు.
తనను క్షమించాలని లక్ష్మినారాయణ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను, మిత్రులను తన సూసైడ్ నోట్‌లో కోరాడు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కెసిఆర్ తీరు పట్ల ఆయన తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications