జగన్‌తో జాగ్రత్త, కూల్చేయబోతే కాపాడాను: చిరంజీవి

ప్రతి వారం రాష్ట్రం ఏదో ఒక మూల పర్యాటక ఉత్సవాలు జరిగేలా నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే దేశంలోని రైతన్నకు పండగెనన్నారు. జగన్ కాంగ్రెస్‌ను కూలదోసే ప్రయత్నం చేయగా, తాను కాపాడానని చెప్పారు. అధికార దాహంతో జగన్ ఎన్నో తప్పులు, అక్రమాలకు పాల్పడ్డారని, జైలు జీవితం అనుభవిస్తున్నా ఆయన తీరులో మార్పు లేదన్నారు.
అవినీతి సొమ్ముతో పేపర్లు, చానళ్లు పెట్టుకొని ద్రుష్పచారం చేయడం అవమానకరమన్నారు. కర్ణాటకలో అవినీతిలో కూరుకుపోయిన బిజెపిని ఆ రాష్ట్ర ప్రజలు తిరస్కరించినట్లే మన రాష్ట్రంలో కూడా అవినీతి జగన్ పార్టీని కూకటి వేళ్లతో పెకలించివేయాలన్నారు. ఆర్థిక నేరం హత్యానేరం కన్నా ప్రమాదకరమైందంటూ జగన్ బెయిల్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను చిరు ప్రస్తావించారు.
బిసి డిక్లరేషన్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ వర్గాలకు తన హయాంలో ఏం ఒరగబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడం కల్ల అన్న ఆయన.. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ... వారి పార్టీకి భస్మాసుర హస్తమన్నారు.












Click it and Unblock the Notifications