యువతికి మాజీ మంత్రి, కొడుకు లైంగిక వేధింపు: కేసు

తెట్టాయిల్, ఆయన కుమారుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేరళలోని సౌర విద్యుత్తు పథకంలో జరిగిన కుంభకోణంపై ఎల్డీఎప్ గత కొన్ని రోజులుగా అధికార పక్షాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. అధికార పార్టీని నిలదీస్తోంది.
ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి, ఎమ్మెల్యే అయిన జోస్ పైన లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ప్రతిపక్షానికి మింగుడు పడకుండా తయారయంది. ఈ కేసును తాను న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి చెబుతున్నారు.
తనపై ఫిర్యాదు చేసిన మహిళ తనకు తెలుసునని, తన కుమారుడికిచ్చి పెళ్లి చేయమని బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పారు. మరోవైపు ఫిర్యాదు చేసిన మహిళ, మాజీ మంత్రి, ఆయన కుమారుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తన వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని చెబుతోంది.












Click it and Unblock the Notifications