ఉద్యోగినిపై ఫైవ్ స్టార్ హోటల్ మేనేజర్ దాష్టీకం, అరెస్ట్

Manager of Hotel helf for abusing employee
పనాజీ: తమ హోటల్లో పని చేసే ఉద్యోగిని పట్ల ఓ హోటల్ మేనేజర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం అతనిని అరెస్టు చేశారు. ఉత్తర గోవాలోని కండోలిమ్ ప్రాంతంలో ఉన్న ఓ ఐదు నక్షత్రాల హోటల్‌కు చెందిన హోటల్ మేనేజర్ యువతి పట్ల అసభ్య ప్రవర్తన, అత్యాచార ఆరోపణలతో అరెస్టయ్యాడు.

మేనేజర్‌గా పని చేస్తున్న యాభై అయిదేళ్ల వికాస్ గురువారం రాత్రి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని అదే హోటల్లో పని చేస్తున్న పద్దెనిమిదేళ్ల బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇళ్ల వద్ద దింపుతానంటూ తనతో పాటు మరో ఉద్యోగినిని కారులో తీసుకు వెళ్లాడని, మార్గమధ్యలో మత్తు మందు కలిపిన కూల్ డ్రింగ్స్ ఇచ్చాడని తెలిపింది.

ఆ తర్వాత తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. వికాస్ పైన ఐపిసి సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

తనపై మేనేజర్ అత్యాచారానికి పాల్పడినట్లు యువతి ఫిర్యాదు చేసిందని, ఆమె ఫిర్యాదు మేరకు తాము నిందితుడిని అరెస్టు చేశామని కోలంగట్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+