అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రతిఇంట్లో భారతం: లక్ష్మీ నారాయణ, అశ్లీల సాంగ్స్ పైనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Laxmi Narayana
అనంతపురం: ఇంట్లో సినిమా సిడిలకు, డివిడిలకు బదులుగా రామాయణం, మహాభారతం ఉండాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) మాజీ అదనపు సంచాలకులు లక్ష్మీనారాయణ ఆదివారం అన్నారు. ఆయన అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అశ్లీల పాటలు రాసే, తప్పుడు సందేహాలు ఇచ్చే దర్శకులు తన దృష్టిలో అవినీతిపరులన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. ఇంట్లో అమ్మ చెప్పే నీతి పాఠాలే పిల్లను భావి భారత పౌరుగులాగా తీర్చిదిద్దుతాయన్నారు. ప్రతి ఇంట్లో సినిమా డివిడిలకు బదులు రామాయణం, మహాభారతం, వేమన, సుమతి శతక గ్రంథాలు ఉండే బావుంటుందన్నారు. వేమన, సుమతి శతకాలు పిల్లలకు నేర్పిస్తే వారిలో నైతికత పెరుగుతుందని చెప్పారు.

అశ్లీల పాటలు రాసే రచయిత, తప్పుడు సందేశాలు ఇచ్చే దర్శకులు తన దృష్టిలో అవినీతిపరులేనని లక్ష్మీనారాయణ అన్నారు. పిల్లలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. స్వచ్చంధ సంస్థలన్నీ ఒకే తాటి పైకి వచ్చి పని చేసినప్పుడు సమాజానికి నిజమైన సేవ అందుతుందన్నారు.

కాగా లక్ష్మీనారాయణ గత నెల పదకొండవ తేది వరకు హైదరాబాదు సిబిఐ జెడిగా విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఆయన ఏడేళ్ల పాటు రాష్ట్రంలో ఉన్నారు. కర్నాటక మాజీ గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసు, జగన్ ఆస్తుల కేసు తదితర కేసులను ఆయన దర్యాఫ్తు చేశారు.

English summary
Former CBI JD Laxmi Narayana has said on Sunday that 
 
 students should read Ramayana, Mahabharata, Sumathi 
 
 and Vemana shathakams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X