పనిమనిషిపై లైంగిక వేధింపు: రాఘవ్ పార్టీ బహిష్కరణ

రాఘవ్ సహాయకుడు రాజ్ కుమార్.. కాంగ్రెసు నేత అజయ్ సింగ్ ఇంటి వద్ద విలేకర్లతో మాట్లాడారు. ఉద్యోగం పేరుతో రాఘవ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. రాజ్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా పోలీసు కేసు నమోదైంది. మరోవైపు రాఘవ్ 79వ పుట్టిన రోజు వేడుకలను ఆదివారం విదిశలో భార్యతో కలిసి ఘనంగా జరుపుకున్నారు.
కాగా స్వలింగ సంపర్కం ఆరోపణలతో మధ్య ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి రాఘవ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇంట్లోని పని మనిషి రాఘవ్ పైన స్వలింగ సంపర్కానికి పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాఘవ్ తన రాజీనామా లేఖను ఇచ్చారు. దీనిని గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ వద్దకు పంపారు.
రాజీనామాను ఆమోదించారు. రాఘవ్ పైన ఆరోపణలు వచ్చిన వెంటనే రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మంత్రి తనతో స్వలింగ సంపర్కం నెరిపారంటూ పని మనిషి రాజ్ కుమార్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు.
అందుకు సంబంధించి ఓ వీడియోను కూడా పోలీసులకు అందజేశాడు. మంత్రికి చెందిన ఇద్దరు అనుచరులు కూడా తనతో అలాగే చేశారని ఆరోపించాడు. ఈ స్వలింగ సంపర్క రాసలీలలను మరో పని మనిషి రహస్యంగా చిత్రీకరించినట్లు అతను చెప్పాడు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను రాఘవ్ కొట్టిపారేశారు. ఇవి రాజకీయ ఆరోపణలే అని చెప్పారు.












Click it and Unblock the Notifications