పార్టీలో అశ్లీల డ్యాన్స్: మల్లికా శెరావత్‌కు కోర్టు వారెంట్
వడోదర: ఐటం గర్ల్ నుండి నటిగా మారిన మల్లికా శెరావత్ చిక్కుల్లో పడింది. ఆమె న్యాయస్థానం మెట్లు ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర కోర్టు ఆమెకు బెయిలబుల్ వారెంటును జారీ చేసింది. అసభ్యకరంగా, అశ్లీల డ్యాన్స్ చేసిందనే ఆరోపణలతో ఆమెకు వడోదర కోర్టు బెయిలబుల్ వారెంటును జారీ చేసింది.
2006లో నూతన సంవత్సర వేడుకల్లో మల్లికా శెరావత్ అసభ్యకరంగా డ్యాన్స్ చేసిందనే అభియోగాలు ఉన్నాయి. ఆగస్టు 19, 2013న తమ ఎదుట హాజరు కావాలని మల్లికను వడోదర కోర్టు వారెంట్ జారీ చేసింది. గతంలో పలుమార్లు ఆమె కోర్టు సమన్లకు స్పందించలేదు.

కోర్టుకు హాజరు కావాలని గతంలో సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె హాజరు కాలేదు. దీంతో మంగళవారం బెయిలబుల్ అరెస్టు వారెంటును జారీ చేసింది. బరోడా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర తివారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మల్లికకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరాడు.
2006లో మల్లిక డ్యాన్సును తివారి టివి ఛానళ్లలో చూసినట్లుగా తెలుస్తోంది. మల్లికతో పాటు నిర్వాహకుల పైన ఆయన ఫిర్యాదు చేశారు. అసభ్యకర, అశ్లీల డ్యాన్సును మల్లిక ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో అప్పుడు చేసింది.
-
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications