ఢిల్లీ మెట్రో: శృంగార వీడియోల చిక్కు, అవార్డు ఆనందం

రైళ్లలోని సిసి టివి కెమెరాల ద్వారా రికార్డైన పలు పోర్న్ ఎస్సెమ్మెస్సెస్ ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. ఇది విమర్శలకు తావిచ్చింది. అయితే ఈ విమర్సలు వస్తుండగానే డిఎమ్మార్సీ ఓ అవార్డును సొంతం చేసుకుంది. డిఎమ్మార్సీ ఇంటెగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఐఎంఎస్) అవార్డును దక్కించుకుంది. ఇది అంతర్జాతీయ అవార్డు.
ఢిల్లీ మెట్రో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లుగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్(ఐఎస్ఓ), ది ఇంటర్నేషనల్ ఆక్యుపేషన్ హెల్త్ అండ్ సేఫ్టే అసెస్‌మెంట్స్ గుర్తించాయి. డిఎమ్మార్సీ చెందిన అధికారి మాట్లాడుతూ.. ఐసో 9001:2008, ఐసో 14001:2004, ఓహెచ్ఎస్ఏఎస్ 18001:2007 ప్రమాణాల ప్రకారం డిఎమ్మార్సీ ఉందని చెప్పారు.
కాగా ఇటీవల డిఎమ్మార్సీ సిసిటివి ఫుటేజ్ విషయమై విమర్శలు ఎదుర్కొంటోంది. ఢిల్లీ మెట్రోల్లో ఉన్న పలు సిసిటివి ఫుటేజిలలోని పోర్న్ మూవీస్, ఎమ్మెమ్మెస్, ఎస్సెమ్మెస్‌లు ఇంటర్నెట్‌లో కనిపించాయి. ఈ వీడియో క్లిప్పింగ్స్ లీకేజిలపై డిఎమ్మార్సీ సైబర్ సెల్ విభాగానికి ఫిర్యాదు చేసింది.
ప్రముఖ హిందీ డైలీ ప్రచురించిన కథనం మేరకు ఢిల్లీ మెట్రో రైళ్లలోని సిసిటివి కెమెరాల ద్వారా రికార్డు కాబడిన 250 వీడియోలోను పోర్న్ వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. వీటిని ఇప్పటి వరకు 1.5 లక్షల మంది వీక్షించినట్లు సదరు డైలీ పేర్కొంది.
ఇందులో కొన్ని జంటలు సన్నిహితంగా ఉన్న వీడియోలు కూడా ఉన్నాయి. అవి రెండు నిమిషాల నుండి ఎనిమిది నిమిషాల వరకు ఉన్నాయి. ఈ క్లిప్స్‌ను 2011 నుండి అప్‌లోడ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై డిఎమ్మార్సీ ఆందోళన వ్యక్తం చేసింది. సైబర్ సెల్ విభాగానికి ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications