శంకర రావుపై కోడలు వంశీప్రియ కేసులు ఉపసంహరణ

శంకర రావు ఇటీవలి కాలంలో పలు కేసులు ఎదుర్కొంటూ చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే. ఈ టెన్షన్ కారణంగా ఆయన ఇటీవల పలుమార్లు అనారోగ్యానికి గురవుతున్నారు. కుటుంబ పెద్దలు పలువురు విష్ణుప్రియను కేసు ఉపసంహరించుకునేలా సంప్రదింపులు జరిపి ఉంటారని అంటున్నారు.
శంకర రావు ఆరోగ్యం దృష్ట్యా కేసులు ఉపసంహరించుకోవాలని కుటుంబ పెద్దలు మధ్యవర్తిత్వం నెరపడంతో వంశీప్రియ వెనక్కి తగ్గిందని అంటున్నారు. వంశీప్రియకు శంకర రావు కుటుంబ సభ్యులు భరణం ఇచ్చేందుకు కూడా సంప్రదింపులు నెరపినట్లుగా తెలుస్తోంది. వంశీప్రియ పిటిషన్ ఉపసంహరించుకోవడంతో సిసిఎస్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు కూడా విత్ డ్రా చేసుకోనున్నారు.
కాగా శంకర రావు ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పలు కేసులు వెంటాడుతున్నాయి. ఇటీవల ఆయనను సిసిఎస్ పోలీసులు కోడలి కేసులో అరెస్టు చేశారు. అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు డిజిపి, ముఖ్యమంత్రిలపై ఆరోపణలు చేసిన కేసులో హైకోర్టులో శంకర రావుకు ఊరట లభించింది. ఆయన ఆరోగ్యం బాగా లేనందున పోలీసుల విచారణపై హైకోర్టు వారం రోజుల పాటు స్టే విధించింది.