వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పడుపు వృత్తిలో అమ్మాయిలు, జిగోలో బాయ్స్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మన దేశంలో మహారాష్ట్ర రాజధాని ముంబై, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరాలలో వ్యభిచార వృత్తి ఎక్కువగా కనిపిస్తుంది. ముంబైలోనే దాదాపు లక్షా యాభై వేల మంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు. ముంబైలోని సెక్స్ వర్కర్లలో యాభై శాతం మందికి పైగా హెచ్ఐవితో బాధపడుతుండవచ్చునని ఓ అంచనా.

బ్యూటీ పార్లర్ పేరుతో, రేవ్ పార్టీల పేరుతో వ్యభిచారం జరుగుతున్నట్లుగా మనం నిత్యం వార్తా పత్రికల్లో, టెలివిజన్ ఛానళ్లలో, ఇంటర్నెట్లో వార్తలు చూస్తుంటాం. ఈ వ్యభిచారం వెనుక పలు కారణాలు ఉంటాయి! కొందరు డబ్బుల కోసం వ్యభిచార రొంపిలోకి దిగితే, మరికొంతమంది బలవంతంగా దిగుతారు. ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి.

ముంబై టాప్

భారత దేశంలో అత్యధిక వ్యభిచారులు ఉండే నగరంగా మహారాష్ట్ర రాజధాని ముంబై మొదటి స్థానంలో ఉంది. ముంబైలోని వేశ్యల్లో దాదాపు యాభై శాతం మంది హెచ్ఐవితో బాధపడుతున్నారట.

పెరుగుతున్న వేశ్యావృత్తి

దేశంలో వ్యభిచార వృత్తి రోజు రోజుకు పెరుగుతోంది. ప్రతి ఏటా పది శాతం పెరుగుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

వ్యభిచారం ఓ చేదు చరిత్ర

వ్యభిచార వృత్తి శతాబ్దాలుగా వస్తోంది. ఇది ఇంకా కొనసాగుతుండటం మనకు బాధ కలిగించేదే.

పదిహేడో దశాబ్దాలం..

పదహారో శతాబ్దం, పదిహేడో శతాబ్దంలోను పలు ప్రాంతాల్లో వ్యభిచార కేంద్రాలు నడిచేవి.

సైన్యంలో..

పంతొమ్మిదో శతాబ్దం, ఇరవయ్యే శతాబ్దంలో పలు ప్రాంతాల్లో వ్యభిచార కేంద్రాలు నడిచేవి.

పడుపు వృత్తిలో గర్ల్స్, జిగోలో బాయ్స్(పిక్చర్స్)

ఇరవయ్యే శతాబ్దంలో బ్రిటిష్ వారు భారతీయ మహిళలను తమకు నిషాన్‌గా భావించేవారు.

వేశ్యా వృత్తి

2007లోని ఓ నివేదిక ప్రకారం సెక్స్ వర్కర్లలో 35 శాతానికి పైగా పద్దెనిమిదేళ్ల కన్నా తక్కువగా ఉన్న వారే ఉన్నారు.

సూరత్‌లో హెచ్ఐవి

గుజరాత్ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు ప్రకారం సూరత్ పట్టణంలో హెచ్ఐవి ఎక్కువగా వ్యాపిస్తోంది.

మహారాష్ట్ర - కర్నాటకలో దేవదాసి వృత్తి

మహారాష్ట్ర - కర్నాటకలలోని కొన్ని ప్రాంతాల్లో దేవదాసి వృత్తి ఉండేది.

కోల్‌కతాలో రెడ్ లైట్ ఏరియా

కోల్‌కతాలోని సోనాగాచి ప్రాంతం దేశంలోని వేశ్యావృత్తి ప్రాంతాల్లో అతి పెద్దది. ముంబై, ఢిల్లీలోను రెడ్ లైట్ ఏరియాలు ఉన్నాయి.

చిన్న పట్టణాలలోను...

ఉత్తరాప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని పలు చిన్న నగరాలు నిన్నటి వరకు వేశ్యావృత్తికి కేంద్రాలుగా నిలిచాయి.

బాలికలు

దేశ వ్యాప్తంగా దాదాపు లక్షల మంది మైనార్టీ తీరని బాలికలు వేశ్యావృత్తిలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

కోట్లలోనే వేశ్యలు

ఓ రిపోర్ట్ ప్రకారం దేశంలో దాదాపు కోట్లలోనే వేశ్యవృత్తిలో ఉన్నారు. అందులో ముప్పై అయిదు శాతానికి పైగా మైనార్టీ తీరని వారే కావడం బాధాకరం.

పవిత్ర స్థలాల్లోను..

పవిత్ర స్థలాల్లోను వ్యభిచార కేంద్రాలను నడిపిస్తున్నారు. ఈ ధోరణి 2000 సంవత్సరం నుండి క్రమంగా పెరిగిందంటున్నారు.

కుటుంబ సమస్యలు

కుటుంబం ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నప్పుడు.. తన కుటుంబాన్ని గట్టెక్కించేందుకు పెద్ద కూతురో మరెవరో వ్యభిచార వృత్తిని ఎన్నుకుంటున్నారట.

నేపాలీ యువతులు

ఓ నివేదిక ప్రకారం రెండు లక్షల మంది నేపాలీ అమ్మాయిలు ఈ కూపంలో ఉన్నారు. అందులో పద్నాలుగేళ్ల లోపు వారు కూడా ఉన్నారు.

నేపాల్ అమ్మాయిలకు గిరాకీ

వర్జిన్‌గా ఉన్న నేపాల్ అమ్మాయిలకు గిరాకీ ఉందట. వారి కోస విటులు అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నారట.

తల్లిదండ్రుల ఆమోదం!

1988లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం అమ్మాయిలు తల్లిదండ్రుల అంగీకారంతో కూడా వ్యభిచార కూపంలోకి దిగుతున్నారట.

స్నేహితుల కారణంగా..

కొంతమంది అమ్మాయిలు స్నేహితుల కారణంగా ఈ వృత్తిలోకి వస్తున్నారట. డబ్బు, విలాసాలకు అలవాటు పడిన కొందరు ఈ కూపంలోకి అడుగుపెడుతున్నారట.

సొంత ప్రాంతాల్లో..

దాదాపు ఐదు శాతం మంది మహిళలు తమ సొంత ప్రాంతాల్లోనే పడుపు వృత్తిలో కొనసాగుతున్నారట.

బ్రోకర్ల ద్వారా..

బ్రోకర్ల కారణంగా చాలామంది అమ్మాయిలు ఈ కూపంలోకి నెట్టబడుతున్నారట.

తెలిసిన వారి ద్వారా...

తమ దగ్గరి వారి ద్వారా పలువురు మహిళలు లైంగిక సంబంధాలకు అలవాటుపడుతున్నారట.

మోసగించబడిన వారు

దాదాపు పది శాతం మంది మహిళలు ప్రేమలో మోసపోయి ఈ వృత్తిలోకి దిగుతున్నారట. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వారు పలువురు కూడా మహిళల్ని బలవంతంగా ఈ వృత్తిలోకి దింపుతున్నారట.

అనుమతితో..

తన భర్త అనుమతితోను పలువురు మహిళలు అడుగుపెడుతున్నారట. అయితే ఇది చాలా తక్కువగా ఉందంటున్నారు.

జిగోలో సేవలు

ఇదివరకు మహిళలు మాత్రమే వ్యభిచార వృత్తిలో ఉండేవారు. ఇప్పుడు మగవారు సైతం ఆ వృత్తిలో కనిపిస్తున్నారు. వారిని జిగోలో అంటారు.

డబ్బులిస్తేనే..!

జిగోలో వ్యాపారం పలు నగరాల్లో ఉంది. వీరికి రోజుకు రూ.1 వేయి నుండి రూ.3వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.

హ్యాండ్‌సమ్ బాయ్స్

జిగోలోను సరఫరా చేసే సంస్థలు కూడా ఉన్నాయట. అందంగా ఉండే అబ్బాయిలనే తీసుకుంటారట.

వేగంగా వ్యాప్తి

జిగోలో పలుచోట్ల వ్యాపారం వేగంగా వ్యాప్తి చెందుతుందట. ఢిల్లీ, ముంబై తదితర నగరాల్లో ఉన్నాయి.

గృహ హింస

కుటుంబ సమస్యల కారణంగా బయటకు వచ్చి జీవిస్తున్న మహిళల్లో పలువురు ఈ వృత్తిలోకి దిగుతున్నారట.

తగ్గించే ప్రయత్నం

పడుపు వృత్తిని తగ్గించేందుకు ప్రభత్వంతో పాటు వివిధ సంస్థలు పని చేస్తున్నాయి.

కాల్ గర్ల్ నెంబర్

కాల్ గర్ల్స్ ఫోన్ నెంబర్లు ఎవరు ప్రచురించకూడదు లేదా చెప్పరాదు. లేదంటే జైలు లేదా ఫైన్ తప్పదు.

హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు

ప్రపంచవ్యాప్తంగా రెండువందల మిలియన్ మంది లైంగిక వ్యాధులతో బాదపడుతుంటే అందులో మన దేశానికి చెందిన వారే నాలుగొంతులు ఉన్నారు.

English summary
Mumbai and Kolkata have the India's largest prostitution industry, with over 150,000 sex workers in Mumbai. It is estimated that more than 50 per cent of the sex workers in Mumbai have HIV. There are lots of findings regarding flesh trade in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X