'బిల్లు'తో నిరసన తెలిపారని రెస్టారెంట్‌ను మూయించారు
ముంబై: ఎయిర్ కండిషన్డ్ రెస్టారెంట్‌లలో సర్వీస్ ట్యాక్స్ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఓ హోటల్ వినూత్నంగా నిరసన తెలిపే ప్రయత్నం చేసింది. దాంతో అది కాస్త మూతబడింది. మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని అదిథి రెస్టారెంట్ వినియోగదారులకు ఇచ్చే బిల్లు మీద తమ నిరసనను తెలియజేస్తూ ముద్రించింది.
యుపిఏ ప్రభుత్వ విధానం ప్రకారం డబ్బు తినడం(2జి, బొగ్గు, సిడబ్ల్యూజీ కుంభకోణాలు) అవసరం, ఎసి హోటళ్లలో ఆహారం తీసుకోవడం విలాసం అంటూ బిల్లు మీద ముద్రించింది.
Height of Intolerance! http://t.co/j7q2J6DMKO #AditiRestaurant pic.twitter.com/oszKFyOx3P
— Narendra Modi (@narendramodi) July 23, 2013
The most worrying thng abt #AditiRestaurant is ths: "The marching orders came from the party headquarters in Delhi" http://t.co/OzvBvZGrLq
— B Shantanu (@satyamevajayate) July 23, 2013
I wish the enraged twitterati on #aditirestaurant would have been just as enraged when the sena broke our office! Selective goondagiri?
— Rajdeep Sardesai (@sardesairajdeep) July 23, 2013
అయితే పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో హోటల్ తిరిగి ఈరోజు(మంగళవారం) తెరుచుకున్నట్లుగా తెలుస్తోంది. యూపిఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముద్రించినందుకు హోటల్ యజమానితో పోలీసులు కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పించారు.
Click it and Unblock the Notifications