లవ్, సెక్స్, ధోకా హత్యలు: ఎపి ఫస్ట్, యుపి సెకండ్

ఆంధ్రప్రదేశ్‌లో ఆ రకమైన హత్యలు 4,901 నమోదు కాగా, ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ రకమైన హత్యలు 4,200 జరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో హత్యలకు గల కారణాలు, హత్యల వెనక గల ఉద్దేశాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో క్రోడీకరించింది. చాలా వరకు హత్యలు ఆస్తి తగాదాలు, ప్రేమ వ్యవహారాలు లేదా లైంగిక సంబంధాలు, వరకట్నం, పిచ్చి, చేతబడులు, మతవిద్వేషం, కుల విద్వేషం, వర్గ వైరుధ్యాలు, రాజకీయ కారణాలు, ఉగ్రవాదం లేదా తీవ్రవాద చర్యల వల్ల జరిగాయని తేలింది.
ఆస్తి తగాదాలు, వ్యక్తిగత కక్షలు, ప్రేమ వ్యవహారాలు లేదా లైంగిక సంబంధాల వల్ల జరిగిన హత్యల సంఖ్య ఎక్కువగా ఉంది. వ్యక్తిగత కక్షల వల్ల ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ హత్యలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ కారణంగా 6,156 హత్యలు జరిగాయి. దేశంలో ఇటువంటి హత్యలు 45,860 జరిగాయి.
ఆస్తి తగాదాల కారణంగా బీహార్‌లో ఎక్కువ హత్యలు జరిగాయి. ఈ కారణంగా మొత్తం 35,668 హత్యలు జరిగితే బీహార్‌లో 9,909 నమోదయ్యాయి. ప్రేమ వ్యవహారాల్లో లేదా లైంగిక సంబంధాల్లో మోసం కారణంగా మొత్తం 28,145 హత్యలు జరిగితే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఇటువంటి హత్యలు మహారాష్ట్రలో 3,253, మధ్యప్రదేశ్‌లో 2,589 జరిగాయి. ఈ కాలంలో సిక్కింలో అతి తక్కువగా 166 హత్యలు మాత్రమే నమోదయ్యాయి. భారతదేశంలో సగటును ఏడాదికి 32 వేల నుంచి 34 వేల హత్యలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications