రాజీనామా అనలేదు, రాయలసీమ స్టేట్: టిజి వెంకటేష్

తమ ప్రాంత ప్రజల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. రాజీనామాలు చేస్తామని మాత్రం తాము ప్రకటించలేదన్నారు. నాలుగు గోడల మధ్య జరిగిన భేటీపై వివరణ తీసుకొని వార్తలు రాస్తే బాగుండేదన్నారు. సమైక్య రాష్ట్రమే తాము కోరుతున్నామన్నారు. వెనుకబాటుతనం విషయానికి వస్తే మాత్రం ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేయాలని వారు అన్నారు.
తెలంగాణ అభివృద్ధి చెందిందని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. సమైక్యాంధ్ర కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్నామే గానీ రాజీనామాలను చెప్పలేదన్నారు. విభజన పైన కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్నదనే గానీ.. విభజన ఇప్పుడే అని చెప్పలేదని అన్నారు. వాస్తవానికి కాంగ్రెసు పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
సీమాంధ్ర నేతలపై వేటు వేయాలి: జీవన్
ప్రత్యేక తెలంగాణపై అధిష్టానం నిర్ణయం తీసేసుకుందని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి వేరుగా అన్నారు. ఇలాంటి సమయంలో సీమాంధ్ర నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర నేతల పైన క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications