పేరు చెప్పండి.. క్యాష్ ప్రైజ్ గెలుచుకొండి.. ఏపీఎస్ఆర్టీసీ ఆఫర్
కొత్త ప్రాంచైజీలకు, కొత్త బ్రాండ్లకు పేర్లు సహజమే.. అవును అప్పట్లో సినిమాకు కూడా పేరు పెట్టాలని ప్రకటించారు. అందుకోసం జనం నుంచి నేమ్స్ తీసుకొని.. గిప్ట్స్ కూడా ఇస్తుంటారు. ఇప్పుడు ఆర్టీసీ వంతు వచ్చింది. ఏపీఎస్ ఆర్టీసీ కొత్త సర్వీసు ప్రారంభించబోతుంది. దానికి పేరు సూచించాలని కోరుతుంది. అంతేకాదు మంచి పేరు సూచించిన వారికి ప్రైజ్ మనీ కూడా ఇస్తామని అంటోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బంపరాఫర్ ప్రకటించింది. కొత్త బ్రాండ్‌కు మంచి పేరు చెప్పిన వారికి క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అవకాశం కల్పించింది. సలహా ఇవ్వండి.. క్యాష్ ప్రైజ్ సొంతం చేసుకోండని ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఆర్టీసీ కొత్తగా తీసుకొస్తున్న నాన్ ఏసీ స్లీపర్ కోచ్ బస్సు సర్వీసులకు మంచి పేరు చెప్పాలని రాష్ట్ర ప్రజలను కోరింది. అవకాశాన్ని వినియోగించి బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా తమ సర్వీసులకు పేరును సూచించాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కోరారు.

నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో 30 బెర్త్‌లు ఉంటాయి. తొలిసారి ఏపీలో ఈ బస్సులను తీసుకువస్తున్నారు. దూరప్రాంత ప్రయాణికుల కోసం అద్దె ప్రాతిపదికన నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లను ప్రవేశపెడతారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా రేట్లను సిద్ధం చేస్తున్నారు. స్లీపర్ కోచ్‌లో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత ఫ్యాన్, లైట్ ఉంటుంది. ఈ నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లను తీసుకువచ్చి ప్రయాణికులను ఆకర్షించేలా ఆర్టీసీకి బ్రాండ్ ఇమేజ్ తేవాలని భావిస్తున్నారు.
స్లీపర్ కోచ్‌లకు మంచి పేరు సూచించాలని ఎండీ ద్వారకా తిరుమలరావు కోరుతున్నారు. ఈ నెల 24వ తేదీలోగా తగిన పేరు సూచించిన వారికి అవార్డుతోపాటు నగదు రివార్డు అందజేస్తారు. సో ఆలస్యం ఎందుకు పేరు సూచించి.. క్యాష్ ప్రైజ్ గెలుచుకొండి.












Click it and Unblock the Notifications