• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పొత్తులో భాగంగా రెండు సీట్లే : అలా చేస్తే జ‌గ‌న్ కే మేలు : ఢిల్లీలో రెండు పార్టీల ఎంపీల క‌ల‌క‌లం..!

|

ఎప్పుడూ ఉప్పూ -నిప్పూ లా ఉండే కాంగ్రెస్ -టిడిపి ఎంపీలు అప్పుడే ఒక్క‌ట‌య్యారు. ఢిల్లీ కేంద్రంగా ఏపి రాజ‌కీయాల పై ఎవ‌రి వాద‌న‌లు వారు వినిపిస్తున్నారు. కాంగ్రెస్ - టిడిపి ఎంపీలు ఏపిలో త‌మ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు అంశం పై సుదీర్థంగా చ‌ర్చించారు. పొత్తు ఉందా లేదా తేల్చాలని రెండు పార్టీల్లో క్షేత్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది. ఇదే స‌మ యంలో పొత్తు కుదిరినా..కాంగ్రెస్ కు రెండు లోక్‌స‌భ కంటే ఇచ్చే ఛాన్స్ లేద‌ని ..ఇక‌వేళ ఇస్తే వైసిపికి మేలు జ‌రుగు తుంద‌ని తేల్చి చెబుతున్నారు. దీంతో..కాంగ్రెస్ నేత‌లు డైల‌మా లో ప‌డ్డారు..

పొత్తు పై రెండు పార్టీల ఎంపీల మైండ్‌గేమ్‌..!

పొత్తు పై రెండు పార్టీల ఎంపీల మైండ్‌గేమ్‌..!

ఏపిలో పొత్తు వ్య‌వ‌హారం కాంగ్రెస్ -టిడిపి ఎంపీలు మైండ్ గేమ్ అడుతున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ తో టిడిపి అధినేత చంద్ర‌బాబు స‌మావేశ‌మైన స‌మ‌యంలో ఈ పొత్తు వ్య‌వ‌హారం పై చ‌ర్చిస్తార‌ని భావించారు. అయితే, ఫ‌లితం ఏంట‌నేది బ‌య‌ట‌కు రాక‌పోవ‌టంతో ఎంపీలు త‌మ అభిప్రాయాల‌ను షేర్ చేసుకున్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ నివాసంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జైరాంరమేశ్‌, కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.. టీడీపీపీ నేత సుజనా చౌదరి తో మంతనాలు జరిపారు. ఢిల్లీలోనే ఉన్న మాజీ ఎంపీ సబ్బం హరిని కూడా చర్చలకు ఆహ్వానించారు. రాష్ట్రంలో టీడీ పీతో పొత్తు ఉండాలా లేదా అన్న విషయం తమకు ముఖ్యం కాదని.. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ ఏర్పా టు చేయడం ప్రస్తుతం చారిత్రక ఆవశ్యకతని జైరాం రమేశ్‌ చెప్పినట్లు తెలిసింది.

ఏపిలో మోడీ స‌న్నిహితుడి భారీ పెట్టుబ‌డులు : వ‌్యాపారమా - రాజ‌కీయమా : ఏం జ‌రుగుతోంది..!

ఎక్కువ ఇస్తే వైసిపికే లాభం..

ఎక్కువ ఇస్తే వైసిపికే లాభం..

టిడిపి -కాంగ్రెస్ పొత్తుతో ప్ర‌యోజ‌నం ఉంటుందో లేదో స్ప‌ష్ట‌త లేద‌ని సీనియ‌ర్ నేత కేవీపి రామ‌చంద్ర‌రావు అభిప్రా య ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఒక వేళ‌..పొత్తు ఉన్నా కాంగ్రెస్ కు ఒక‌టి లేదా రెండు ఎంపీ సీట్లు కంటే ఇచ్చే ప‌రిస్థితి ఉం డ‌ద‌ని..ఎక్కువ సీట్లిస్తే అన‌స‌రంగా వైసిపి కి వాటిని అప్ప‌గించిన‌ట్లవుతుంద‌ని టిడిప నేత‌లు సుజ‌నా..సీయం ర‌మేష్ కాంగ్రెస్ నేత‌ల‌కు అస‌లు విష‌యం తేల్చేసారు. అయితే, ఏపిలో పొత్తులు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని స‌బ్బం హ‌రి త‌న అభిప్రా యం వ్య‌క్తం చేసారు. రెండు నెల‌ల తరువాత ప‌రిస్థితి మార‌వ‌చ్చ‌ని..అప్ప‌టి ప‌రిస్థితికి అనుగుణంగా నిర్ణ‌యం తీసుకో వ‌చ్చ‌ని విశ్లేషించారు. అయితే, టిడిపి నేత‌లు మైండ్ గేమ్ అడుతున్నార‌ని కాంగ్రెస్ ఎంపీలు త‌మ అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఏపిలో పొత్తుల పై స‌ర్వేలు ..

ఏపిలో పొత్తుల పై స‌ర్వేలు ..

ఏపి లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలంటే టిడిపి నేత‌ల‌కు తెలంగాణ ఫ‌లితాల భ‌యం వెంటాడుతోంది. ప్ర‌ధానంగా సీమాంధ్ర ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న గ్రేట‌ర్ ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో దారుణ‌మైన ఫ‌లితాలు రావ‌టం తో సాధార‌ణ ఓట‌ర్లు సైతం త‌మ మ‌ధ్య పొత్తును అంగీక‌రింటం లేద‌నే అంచ‌నాకు టిడిపి నేత‌లు వ‌చ్చారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో రాజకీయంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు..తెలంగాణ లో పొత్తు పెట్టుకొని..ఇప్పుడు ఏపిలో పొత్తు లేకుండా విడి విడిగా పోటీ చేస్తే ప్ర‌జ‌ల్లో ఎటువంటి సంకేతాలు వెళ్తాయ‌నే భ‌యం వారికి ప‌ట్టుకుంది. ఇది ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ఆయు ధం ఇచ్చిన‌ట్లువుతుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే, అస‌లు కాంగ్రెస్ తో పొత్తు వ‌ల‌న ప్ర‌యోజ‌నం ఉందా లేదా అనే విష‌యం పై టిడిపి అధినేత ప‌లు సంస్థ‌ల‌తో అనేక కోణాల్లో స‌ర్వే చేయిస్తున్న‌ట్లు స‌మాచారం. వీటి రిపోర్టు ఆధారంగా తుది నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం ఉంది.

English summary
AP MP's form Congress and TDP met in Delhi to discuss about alliance between Congress and TDP in AP elections. TDP leaders says if more than two loksabha seats give to congress it helps opposition. Some leaders alliance may not useful in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X