ఏపీలో బోగస్ చలాన్ల భారీ స్కాం: కోట్లాది రూపాయల ఆదాయానికి గండి, సీఎం జగన్ సీరియస్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ చలాన్ల భారీ స్కాం వెలుగుచూసింది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్లాది రూపాయలను తమ జేబుల్లో వేసుకుంటున్నారు
అక్రమార్కులు. సాఫ్ట్‌వేర్ లోపాలను ఆసరాగా చేసుకుని ఈ అక్రమాలకు తెగబడుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోటు చేసుకున్న ఈ అవినీతి అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

సాఫ్ట్‌వేర్ లోపాలను ఆసరాగా చేసుకుని ఫేక్ చలాన్ల స్కాం..
ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈ బోగస్ చలాన్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 35 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఉన్నతాధికారులు దాడులు నిర్వహించినట్లు రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు తెలిపారు. సీఎఫ్ఎంఎస్‌లోని లోపాలే ఆసరాగా కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తించారు. సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకుంటోన్న అక్రమార్కులు ఈ చలానాలను దారి మళ్లిస్తున్నట్లు తేల్చారు. సీఎప్ఎంఎస్, ఈ-చలానా, ఈసీ, ఆర్‌హెచ్, నకళ్లను సీనియర్ సిస్టెంట్లు చేయాల్సి ఉండగా.. ఈ పనులను ప్రైవేటు రైటర్స్‌తో చేసయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ దందా వెనుక సబ్ రిజిస్ట్రార్లే సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలున్నాయి. డాక్యుమెంట్ రైటర్లు కేవలం పాత్రధారులేనని, రిజిస్ట్రార్లు చెప్పినట్లు వీరు చేస్తున్నారని సమాచారం.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దాడులు.. అక్రమార్కులపై వేటు
కడప జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ బోగస్ చలానాలు బయటపడటం కలకలం సృష్టిస్తోంది. దీంతో, దీంతో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు, ఇద్దరు క్లర్క్‌లపైనా సస్పెన్షన్ వేటు పడింది. నకిలీ చలానాలతో కోటి రూపాయలకుపైగా దారి మళ్లించనిట్లు నిర్ణారణ కావడంతో వేటువేశారు ఉన్నతాధికారులు. కడప అర్బన్ సబ్ రిజిస్ట్రార్లు చంద్రమోహన్, సుబ్బారెడ్డి, అసిస్టెంట్ రత్నమ్మ తోపాటు కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ హరికృష్ణ, అసిస్టెంట్ సుకుమార్‌ను విధుల నుంచి తొలగించారు. కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. సబ్ రిజిస్ట్రార్ సోపియా బేగం, జూనియర్ అసిస్టెంట్ వీరన్నను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నకిలీ చాలానాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు తేలడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. అంతేగాక, బోగస్ చలానాలతో అక్రమాలకు పాల్పడిన ఆరుగురు స్టాంప్ రైటర్లపైనా కేసులు నమోదు చేశారు.

వరుస దాడులతో జాగ్రత్తపడుతున్న అక్రమార్కులు
మరోవైపు, ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు బయటపడ్డాయి. గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో బోగస్ చలానాలతో కోట్లు కొట్టేసినట్లు తనిఖీల్లో గుర్తించారు. భారీ మొత్తంలో డబ్బులు పక్కదారి పట్టినట్లు అధికారులు తేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్నతాధికారులు దాడులు జరుపుతుండటంతో మరికొందరు అక్రమార్కులు జాగ్రత్తపడుతున్నారు. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ రాధాకృష్ణ తనపైకి రాకుండా ఉండేందుకు తెలివిగా.. డాక్యుమెంట్ రైటర్స్‌పై ఫిర్యాదు చేశారు. నకిలీ ఈ చలానాలతో అక్రమాలకు పాల్పడ్డారంటూ ముగ్గురిపై ఫిర్యాదు కచేశారు. దర్యాప్తులో అక్రమాలను వెలుగులోకి తెస్తున్నారు అధికారులు.
Recommended Video

చలాన్ల అక్రమాలపై సీఎం జగన్ సీరియస్.. రికవరీకి ఆదేశం
ఇది ఇలావుండగా, బోగస్ చలాన్ల అక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆరా తీశారు. అంతేగాక, సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించినట్లు సమాచారం. పక్కదారి పట్టిన ప్రభుత్వ నిధులను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అక్రమార్కుల నుంచి రూ. 90 లక్షల మేర స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు జరిగినట్లు తేల్చారు. ఇక సోమవారం నుంచి కొత్త సాఫ్ట్‌వేర్ ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయి. సాఫ్ట్‌వేర్ సీఎప్ఎంఎస్‌ను ఎన్ఐసీతో అనుసంధానం చేస్టున్నట్లు తెలిసింది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications