కర్నూలు నుంచి కేసీఆర్ : నంద్యాల నుంచి అసదుద్దీన్‌ : తేల్చుకుందాం..!

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత చంద్ర‌బాబుకు ల‌క్ష్యంగా కెసిఆర్‌..అస‌ద్ చేసిన వ్యాఖ్య‌లు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. కెసిఆర్ ప‌రోక్షంగా..అస‌ద్ ప్ర‌త్య‌క్షంగా జ‌గ‌న్ కు మ‌ద్ద‌తిచ్చేలా మాట్లాడ‌టం పై టిడిపి నేత‌లు ఫైర్ అవుతున్నారు. ఆ ఇద్దరి నేత‌ల వ్యాఖ్య‌ల కు కౌంట‌ర్ ఇస్తున్నారు. ఏపిలో వారి ప్ర‌భావం ఉండ‌ద‌నే విధంగా టిడిపి నేత లు త‌మ వ్యాఖ్య‌ల ద్వారా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా, ఆ ఇద్ద‌రు నేత‌ల‌కు టిడిపి ఓ ఆఫర్ ఇచ్చింది. కెసిఆర్‌.. అస‌ద్ ల‌ను ఏపి నుండి పోటీ చేసి..త‌మ సత్తా నిరూపించుకోవాల‌ని టిడిపి నేత‌లు స‌వాల్ చేస్తున్నారు.

కెసిఆర్‌-అసద్ ల‌కు టిడిపి కౌంట‌ర్‌

కెసిఆర్‌-అసద్ ల‌కు టిడిపి కౌంట‌ర్‌

తెలంగాణ ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత ఏపి సీయం చంద్ర‌బాబు లక్ష్యంగా కెసిఆర్..ఎంఐఎం అధినేత అస‌ద్ లు కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఏపి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామ‌ని చెబుతున్న ఈ నేత‌లిద్ద‌రూ ఏ విధంగా ముందుకెళ్తారో మాత్రం చెప్ప‌టం లేదు. తాను చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ఘ్ ఇస్తాన‌ని కెసిఆర్ చేసిన వ్యాఖ్య‌ల పై ముఖ్య‌మంత్రి చంద్ర బాబు మొద‌లు పార్టీ నేత‌లు సీరియ‌స్ గానే స్పందించారు. ప‌రోక్షంగా జ‌గ‌న్ కు మేలు చేసేలా మాట్లాడార‌ని టిడిపి నేత లు జ‌గ‌న్ ను సైతం ఇరుకున పెట్టే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇక‌, ఎంఐఎం అధినేత అస‌ద్ నేరుగా చంద్ర‌బాబు ను ఉద్దేశించి ఏపిలో టిడిపికి వ్య‌తిరేక‌త ఉంద‌ని..రెండు సీట్లు మించి గెల‌వ‌ర‌ని జోస్యం చెప్పారు. త‌న మిత్రుడు జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తాన‌నే విధంగా అస‌ద్ చేసిన వ్యాఖ్య‌ల పై టిడిపి నేత‌లు మండి ప‌డుతున్నారు.

క‌ర్నూలు నుండి కెసిఆర్ ..నంద్యాల నుండి అసదుద్దీన్‌..

క‌ర్నూలు నుండి కెసిఆర్ ..నంద్యాల నుండి అసదుద్దీన్‌..

కెసిఆర్‌..అస‌ద్ ల‌కు టిడిపి నేత‌లు కౌంటర్ ఇచ్చే క్ర‌మంలో భాగంగా..తాజా గా ఓ ఆఫ‌ర్ ఇచ్చారు. క‌ర్నూలు జిల్లా టిడిపి నేత‌లు ఈ వ్యాఖ్య‌లు చేసారు. అస‌ద్ ను ఉద్దేశించి మంత్రి ఫ‌రూక్ తీవ్రంగా స్పందించారు. గతంలో అసదుద్దీన్‌ తనపై పోటీ చేసి ఓడిన సంగతి అందరికీ తెలుసని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కర్నూలు లేదా నంద్యాల నుంచి అసదుద్దీన్‌ పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వస్తాయో తెలుస్తుందన్నారు. అదే క‌ర్నూలు నుండి వైసిపి ఎమ్మెల్యే గా గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కర్నూలు నుంచి కేసీఆర్‌.. నంద్యాల నుంచి అసదుద్దీన్‌ పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు. ప్రజల మద్దతు ఎవరికి ఉందో తేలుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్ర‌బాబు కు జ‌గ‌న్ కౌంట‌ర్ : వీరు సై అంటారా..

చంద్ర‌బాబు కు జ‌గ‌న్ కౌంట‌ర్ : వీరు సై అంటారా..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్‌..ఎంఐఎం అధినేత అస‌ద్ చేసిన వ్యాఖ్య‌ల‌తో వారికి స‌మాధానం చెబుతూనే టిడిపి నేత‌లు జ‌గ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నారుద‌. ఏపికి ప్ర‌త్యేక హోదా అడ్డుకున్న కెసిఆర్ తో జ‌గ‌న్ ఎలా పొత్తు పెట్టు కుంటార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో..వైయ‌స్ ముఖ్య‌మంత్రి కావ‌టం కోసం పాత‌బ‌స్తీలో అల్లర్లు సృష్టించార‌ని అటువంటి వ్య‌క్తి కుమారుడితో ఎలా పొత్తు పెట్టుకుంటార‌ని అస‌ద్ ను ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి జ‌గ‌న్ సైతం గ‌ట్టిగానే స‌మాధానం ఇచ్చారు. హ‌రికృష్ణ భౌతిక కాయం వ‌ద్ద కెటిఆర్ తో పొత్తు కోసం ఎందుకు మంత‌నాలు జ‌రిపావ‌ని జ‌గ‌న్ నేరుగా చంద్ర‌బాబును ప్ర‌శ్నిస్తున్నారు. టిఆర్‌య‌స్ కాద‌న‌టంతో కాంగ్రెస్ తో చంద్ర‌బాబు క‌లిసార‌ని జ‌గ‌న్ గ‌ట్ట‌గానే స‌మాధానం ఇచ్చారు. ఇక‌, టిడిపి నేత‌లు కెసిఆర్‌..అసద్ ల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆ రెండు పార్టీల నుండి ఎటువంటి స‌మాధానం ప్రతి స్పంద‌న వ‌స్తుందో చూడాలి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+