వివేకా హత్య కేసు: సీబీఐ ఎంక్వైరీ, మేం కలుగజేసుకోం.. ఒత్తిడి లేదు: డీజీపీ
వైఎస్ వివేకానంద హత్య కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. వివేకా కూతురు సునీతారెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం కలకలం రేపింది. తన సోదరుడు, కడప ఎంపీ అవినాశ్ రెడ్డిపై విచారణ చేయాలని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఆమె రాసిన లేఖ పెను దుమారం రేపింది. ఈ క్రమంలో రాష్ట్ర పోలీస్ బాస్ స్పందించారు. ఏపీ డీజీపీగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన రాజేంద్రనాథ్ రెడ్డి.. వివేకా హత్య, ఆ కేసు దర్యాప్తుపై కీలక ప్రకటన చేశారు.
వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో తామేమీ కలుగజేసుకోవడం లేదని కూడా తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో రాష్ట్ర పోలీసులపై ఎలాంటి ఒత్తిడిలు కూడా లేవని ఆయన చెప్పుకొచ్చారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతుందని.. నిందితులకు శిక్ష పడుతుందని తెలియజేశారు.

ఇటు హత్యపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ వాంగ్మూలాన్ని చూసినా సీఎం జగనే నిందితుడిగా తేలుతున్నారని ఆయన అన్నారు. ఈ హత్య కేసులో జగన్ పూర్తిగా కూరుకుపోయారని కామెంట్ చేశారు. వివేకా హత్య కేసును తనపై నెట్టాలని ప్రయత్నించారని చెప్పారు. బాబాయ్ హత్య ఘటనతో జగన్ అన్ని విధాలుగా పతనమయ్యారని అన్నారు. హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తే ఏమవుతుంది? ఇప్పటికే 11 కేసులు ఉన్నాయి, ఇది 12వ కేసు అవుతుంది అని జగన్ అనడం దారుణమని... చట్టం అంటే లెక్కలేనితనాన్ని ఇది సూచిస్తోందని మండిపడ్డారు. వివేకా హత్యలో ప్రధాన సూత్రధారి ఎవరనే విషయం అందరికీ అర్థమయిందని చెప్పారు.
ప్రతి సమస్యను తప్పుదోవ పట్టించేందుకు జగన్ మళ్లింపు రాజకీయాలు అమలు చేస్తున్నారని... ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోనంత అమాయకులు కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. వైయస్ రాజశేఖరరెడ్డి కోటలోనే ఆయన సోదరుడిని హత్య చేశారని... పెద్దల ప్రోత్సాహం లేకుండా హత్య ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
అంతకుముందు మాజీమంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. దస్తగరి ఇదివరకే ఈ కేసులో అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో దస్తగిరి రెండోసారి వాంగ్మూలం ఇచ్చారు. రెండో వాంగ్మూలం తర్వాత తనకు భద్రత కావాలని అనిపిస్తోందని అన్నాడు. కుటుంబం కోసమే వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారానని దస్తగిరి వివరించాడు. డబ్బు కోసం అప్రూవర్‌గా మారానని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నాడు.












Click it and Unblock the Notifications